E-Paper
Advertisement

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!
Advertisement

DK Aruna: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ గారు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం అందరూ తమ ఇళ్ల ముందు ‘ఆశీస్సుల దీపం’ వెలిగించాలని కోరారు. దేశానికి ఆయన అందిస్తున్న నిరంతర సేవలను గుర్తుచేసుకుంటూ, మోదీ గారికి మరింత శక్తి, దీర్ఘాయుష్షు కలగాలని దేవుడిని ప్రార్థించాలని ఆమె ఆకాంక్షించారు.

25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా సేవ

Advertisement

నరేంద్ర మోదీ గారు గత 25 ఏళ్లుగా ప్రజా సేవే పరమావధిగా అలుపెరుగక శ్రమిస్తున్నారని డీకే అరుణ పేర్కొన్నారు. కరోనా వంటి కష్టకాలంలో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపి విజయవంతంగా ముందుకు నడిపారని గుర్తుచేశారు. మరోవైపు దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని, నక్సలిజం రహిత భారత్‌ను సాకారం చేస్తూ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించారని ఆమె కొనియాడారు.

ఆశీస్సుల దీపంతో సంఘీభావం

Advertisement

‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానికి మన వంతు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అందుకే సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు ఆశీస్సుల దీపం వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ‘నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపం వెలిగిస్తున్నాను, మీరంతా కూడా భాగస్వాములై ప్రధానికి మన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేయాలి’ అని డీకే అరుణ పిలుపునిచ్చారు.

Also Read: డీఎస్సీ, APPSC అక్రమాలపై CBI విచారణ జరపాల్సిందే.. మాజీ మంత్రి అంబటి డిమాండ్!

Tags

Related News

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

డిజిటల్ చెల్లింపులపై కొత్త టాక్స్.. సామాన్యుడికి మోదీ సర్కార్ దెబ్బ!

ఓ వైపు చీప్ పబ్లిసిటీ.. మరోవైపు ఘనంగా వేడుకలు.. తమిళనాట గణేశ్ ఉత్సవాలు అదరహో!

బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే పరాగ్.. వేల కోట్లకు అధిపతి, అసలు కారణమేంటి?

పబ్లిసిటీకి వెళ్లాడు.. హోటల్ ఓనర్ అరెస్ట్, బిర్యానీ ప్రకటనలో గణేశుడు

Big Stories

Advertisement
×