Panipuri Ganesh Idol: మహారాష్ట్రలో గణేష్ నవరాత్రి వేడుకలు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఏర్పాటు చేసే రకరకాల వినూత్న వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ సారి కూడా పూణేలోని ఒక వినూత్న గణపతి విగ్రహం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏకంగా పానిపూరీలతో గణనాథుడి విగ్రహాన్ని రూపొందించి.. నిర్వాహకులు అందరినీ ఆశ్చర్యపరిచారు.
పూణేలోని ఎఫ్‌సీ రోడ్‌కు చెందిన రూపేష్, దినేష్ గుడ్మేవార్ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఏకంగా 21,000 పానీపూరీలను ఉపయోగించి 13 అడుగుల ఎత్తైన భారీ గణపతి విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహ తయారీకి కళాకారులకు దాదాపు రెండు నెలల సమయం పట్టిందట. పానీపూరీలు చాలా సున్నితంగా ఉండటం వల్ల, ఉత్సవాలు ముగిసే వరకు విగ్రహం చెక్కుచెదరకుండా చూసేందుకు కళాకారులు 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారట.
21,000 pani puris went into making this 13-foot Ganpati in Pune. 😳🙏
From street food to street-side art, this is peak Pune creativity.#GanpatiBappaMorya #Pune pic.twitter.com/LIvBHDi4Jd
— Gaurav Patel (@GauravPatel__01) September 15, 2026
ఈ పూరీ గణపతి ప్రత్యేకత కేవలం అలంకరణకే పరిమితం కాలేదు. పండుగ ముగిసిన తర్వాత ఈ పానీపూరీలను నీటిలో నిమజ్జనం చేయకుండా సేంద్రీయ ఎరువుగా (Organic Fertilizer) మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. పర్యావరణానికి హాని కలగకుండా, పదార్థాలను వృథా చేయకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పానీపూరీ గణనాథుడికి సంబంధించిన వీడియోలు ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ‘జై శ్రీ గణేష్’ అని కామెంట్లు చేస్తూ ఈ విగ్రహ తయారీలోని సృజనాత్మకతను, కళాకారుల శ్రమను కొనియాడుతున్నారు.
Also Read: జియో సెన్సేషనల్ ఆఫర్.. ఫ్రీగా ‘కాన్వా ప్రో’ సేవలు.. డిజైనర్ అవ్వడం ఇక చాలా ఈజీ!
ఒకవైపు ఈ విగ్రహానికి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ మరొకవైపు ఆహార పదార్థాలను ఇలా విగ్రహాల తయారీకి ఉపయోగించడంపై చిన్నపాటి చర్చకు దారి తీసింది. పానీపూరీలను ఎరువుగా మార్చడం మంచి ఆలోచనే అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని ఇలా ఉపయోగించే బదులు పేదలకు పంచితే బాగుండేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారత్ లాంటి దేశంలో ఇంత ఆహారాన్ని అలంకరణ కోసం వాడటం సరైంది కాదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే గణేష్ ఉత్సవాల్లో ఇటువంటి వినూత్న ప్రయోగాలు పండుగ వాతావరణానికి మరింత శోభను చేకూరుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: తప్పు నాది కాదు నీది.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తన తప్పుని అంగీకరించరు