ibomma Ravi:సినిమాలను పైరసీ చేసి.. ఐబొమ్మ అనే పైరసీ నెట్వర్క్ లో థియేటర్లలోకి రాకముందే విడుదల చేసి నిర్మాతలకు, సినీ పరిశ్రమకు వేలకోట్ల నష్టాన్ని మిగిల్చిన ఐ బొమ్మ రవి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఒకప్పుడు విదేశాలలో లగ్జరీగా బ్రతికిన ఈయన.. ఇప్పుడు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. కనీసం కుటుంబాన్ని పోషించలేని స్థితిలో.. పూట కూడా గడవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన బ్యాంకు ఖాతాలని వెంటనే అన్ ఫ్రీజ్ చేయాలి అంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల స్కామ్ చేసినప్పుడు లేని బాధ ఇప్పుడు నీ వరకు కష్టం వస్తే ఇబ్బందిగా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
ఐబొమ్మ పైరసీ సినిమాల కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బ్యాంకు ఖాతాలను, ప్రాపర్టీ డిపాజిట్లను కూడా ఫ్రీజ్ చేశారు. దీంతో బ్యాంకు ఖాతాలు కూడా ఫ్రీజ్ అవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తన కుటుంబ పోషణ, నిత్య అవసరాలు, వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బందిగా మారిందని రవి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఆర్థిక అవసరాల కోసమైనా.. ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలలో కొన్నింటినైనా అన్ ఫ్రీజ్ చేయాలి అని విజ్ఞప్తి చేశారు.. ముఖ్యంగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు పోలీసుల వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే గతంలో ఐ బొమ్మ వెబ్సైట్లో పైరసీ సినిమాలను ప్రసారం చేయడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఐ బొమ్మ రవి మీద ఉన్నాయి. అంతేకాదు దమ్ముంటే తనను పట్టుకోవాలని రవి పోలీసులను సవాలు కూడా చేశారు. ఆ సవాల్ ను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. అతడు హైదరాబాద్ కి వచ్చినప్పుడు నిఘా పెట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జైలు శిక్ష అనుభవించిన రవి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ: తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!
ఎవరీ ఐబొమ్మ రవి?
ఇతడి అసలు పేరు ఇమ్మాడి రవి. సినిమా పైరసీ వెబ్సైటు ఐ బొమ్మ వ్యవస్థాపకుడు కూడా.. వెబ్ హోస్టింగ్ లో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి.. 2019లో ఐ బొమ్మ పైరసీ నెట్వర్క్ ను ప్రారంభించాడు. అనేక మిర్రర్ వెబ్సైట్లను నడిపి వేలాది సినిమాలను లీక్ చేసి భారతీయ చలనచిత్ర సినీ పరిశ్రమకు భారీగా నష్టాలు మిగిల్చాడు. ఇక వ్యక్తిగత సమస్యల కారణంగా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన రవిని 2025 నవంబర్ 14న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా అధికారులు ఇతడి బ్యాంకు ఖాతాలలో సుమారుగా రూ.3000 కోట్లను ఫ్రీజ్ చేసి అతడి ఆస్తి డిపాజిట్లను జప్తు చేశారు. ఇక తెలంగాణ హైకోర్టు 2026 ఫిబ్రవరి 17న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. ఆ మరుసటిరోజే చంచల్గూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.