C.M.Vijay -Trisha: ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విజయ్ త్రిష జంట ఒకటి. వీరిద్దరూ కలిసి గతంలో పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఇక ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎంగా బాధితులు తీసుకున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే సినిమాలకు దూరమయ్యారు. ఇక త్రిష పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికి ఈమె సీఎం విజయ్(C.M.Vijay) కి సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా త్రిష రిలేషన్ లో ఉన్నారని, విజయ్ సంగీత విడాకులు వచ్చిన వెంటనే వీరిద్దరి రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే త్రిష(Trisha) విజయ్ ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసి కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరికి సంబంధించి నిత్యం వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఇటీవల త్రిష, విజయ్ ఇద్దరు లండన్ పర్యటనలో కూడా జంటగా కనిపించిన సంగతి తెలిసిందే. త్రిష తన సినిమా షూటింగ్లో భాగంగా లండన్ వెళ్ళగా, సీఎం విజయ్ రాజకీయ కార్యకలాపాలలో భాగంగా లండన్ వెళ్లారు. అయితే వీరిద్దరూ అక్కడే సిల్వర్ స్టోన్ రేసింగ్ ఈవెంట్లో పాల్గొన్న నటుడు అజిత్(Ajith) ను కలిసి ఈవెంట్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
ఇకపోతే విజయ్ ఈ రేసింగ్ చూస్తున్న నేపథ్యంలో త్రిష ఉన్నఫలంగా పక్కకు వచ్చిన నిలబడటంతో విజయ్ మాత్రం చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ తన మొహం పక్కకు తిప్పుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గురించి ప్రముఖ సీనియర్ నటి అంబికా(Ambika) స్పందిస్తూ త్రిష వ్యవహార శైలిని పూర్తిగా తప్పు పట్టారని చెప్పాలి. అంబిక ఈ ఘటన గురించి మాట్లాడుతూ..”స్నేహం తప్పు కాదు కానీ ఒకరు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మన వల్ల వారికి చెడ్డ పేరు వస్తుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి… నేను త్రిష స్థానంలో కనుక ఉంటే నా వల్ల అంత నెగెటివిటీ వస్తుందని తెలిస్తే అలాంటి బహిరంగ కార్యక్రమాలకు వెళ్లే దాన్ని కాదు” అంటూ ఈమె త్రిష చర్యలను తప్పుపడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విజయ్ ఎన్నికలలో విజయం సాధించడం మరుక్షణం నుంచి త్రిష తరచూ విజయ్ కార్యకలాపాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే .గతంలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా త్రిష హాజరయ్యి వేదిక పంచుకున్న సంగతి తెలిసిందే. ఇలా త్రిష తరచూ విజయ్ కార్యకలాపాలలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈమె వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా లండన్ లో కూడా వీరిద్దరూ ఒకే చోట కనిపించడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ అసౌకర్యంగా కనిపించడంతో అంబికా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు.