E-Paper
Advertisement

Boeing 747 : బోయింగ్ 747.. నేటికీ క్వీనే

Boeing 747 : బోయింగ్ 747.. నేటికీ క్వీనే
Advertisement

boeing 747: ‘క్వీన్ ఆఫ్ ది స్కైస్’గా బోయింగ్ 747 విమానాలకు పేరుంది. నిరుడు డిసెంబర్ 31 నాటికే ఈ విమానాలకు గుడ్‌బై చెప్పేసింది బోయింగ్ సంస్థ. దాదాపు 5 దశాబ్దాల పాటు విమానయానరంగాన్ని 747 విమానాలే శాసించాయి. గత 50 ఏళ్లలో 1500 విమానాలను తయారు చేశారు.

747 తయారీ నిలిచిపోయినా.. ఇంకా 440 విమానాలు సేవలందిస్తున్నాయి. తొలి బోయింగ్ 747 విమానం జనవరి 22, 1970 న్యూయార్క్ నుంచి టేకాఫ్ తీసుకుంది. చిట్టచివరి విమానాన్ని నిరుడు ఫిబ్రవరి 1న అట్లాస్ ఎయిర్‌కు డెలివరీ చేశారు. ఆగస్టు నాటికి 440 విమానాలు ఇంకా ప్రయాణికులను చేరవేస్తూనే ఉన్నాయి.

Advertisement

బోయింగ్ 747 ద్వారా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను చేరవేస్తున్న విమానయాన సంస్థగా లుఫ్తాన్సాకు పేరుంది. ఆ సంస్థ వద్ద 747 విమానాలు 27 ఉన్నాయి. ఇక ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న 747 విమానాల్లో అత్యధిక భాగం అట్లాస్ ఎయిర్ వద్దే ఉన్నాయి. ఆ సంస్థ ఫ్లీట్‌లో వీటి సంఖ్య 52.

కార్గో ఎయిర్‌లైనర్లలో ఇప్పటికీ 747 విమానాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఏరియల్ ఫ్రైట్ స్పెషలిస్టులైన యూపీఎస్ ఎయిర్ లైన్స్ వద్ద 41, కార్గో‌ఫ్లక్స్ వద్ద 29 విమానాలు సర్వీసులో ఉన్నాయి. అమెరికా కార్గో ఎయిర్ లైన్ సంస్థ కలిటా ఎయిర్ వద్ద 24 విమానాలు ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.

Advertisement

ఆసియాలో ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌గా బోయింగ్ 747 స్థానం చెక్కుచెదరలేదు. హాంకాంగ్‌కు చెందిన క్యాథే పసిఫిక్, దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ ఎయిర్ వద్ద 20 విమానాల చొప్పున సర్వీసులో ఉన్నాయి.

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×