E-Paper
Advertisement

Telangana Polls : నిత్యం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి భజన చేస్తున్న కేసీఆర్..

Telangana Polls అధికార బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తిరుగేలేదని గట్టిగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలి కాలంలో నిత్యం కాంగ్రెస్, రెవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండా మాట్లాడలేకపోతున్నారు.

Telangana Polls : నిత్యం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి భజన చేస్తున్న కేసీఆర్..
Advertisement

Telangana Polls | అధికార బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో తిరుగేలేదని గట్టిగా నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలి కాలంలో నిత్యం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండా మాట్లాడలేకపోతున్నారు.

మరో నెల రోజుల్లో జరగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ 90-100 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రాబోతోందని, కనుక కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని ప్రజలకు చెబుతున్నారు. అదే నోటితో ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మేము కాదు… తెలంగాణ రాష్ట్రం, ప్రజలే తీవ్రంగా నష్టపోతారంటూ కేసీఆర్‌ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు.

Advertisement

తెలంగాణ సెంటిమెంట్‌ని ఉపయోగించుకొని గత రెండు ఎన్నికలలో విజయం సాధించిన కేసీఆర్ ఈసారి మాత్రం ప్రజలను ఎఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ బలాన్ని నమ్ముకొని ధైర్యంగా కేసీఆర్ ముందడగు వేయలేకపోతున్నారు. మాటిమాటికీ కాంగ్రెస్, రెవంత్ రెడ్డిని నుంచి తిడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి గండం ఉందని కేసీఆర్‌ పరోక్షంగానే అంగీకరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి పేరును ఇంతకాలం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని గులాబీ బాస్, ఇప్పుడు పదేపదే రేవంత్‌ రెడ్డిని విమర్శిసిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేసి.. ఆ పార్టీని నిర్వీర్యం చేసేసినప్పటికీ ఆ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలపడిందని ఆయన అప్రయత్నంగానే భావిస్తున్నారు.

Advertisement

ఇటీవల సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తుందని ప్రజలను భయపెట్టారన్న విమర్శలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించే.. ఆయన ఈ మాటలన్నారు. ఇలా కేసీఆర్ పదేపదే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలను హెచ్చరించడం.. ఒక విధంగా రేవంత్‌ రెడ్డి సాధించిన విజయమే.

మరో సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. “బీఆర్‌ఎస్ ఓడిపోతే నాకేమి నష్టంలేదు. వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను” అని చెప్పారు. మరోవైపు కేసీఆర్ భుజాలైన మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరి నోట కూడా ఈసారి ఎన్నికలలో ‘బీఆర్ఎస్ ఓడిపోతే’ అనే మాట వినిపించింది. అంటే వారికి తమ పార్టీ గెలుపు మీద అనుమనాలున్నాయా?. ఈ మాటలను బట్టి బిఆర్ఎస్ పార్టీలో నేతలందరూ ఓటమికి మానసికంగా సిద్దపడే ఉన్నారనే అర్థాలు వస్తాయి మరి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×