BigTV English

Central Cabinet Decisions: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం!

Central Cabinet Decisions: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం!

Central Cabinet Decisions


Central Cabinet Decisions before Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

ఢిల్లీ మెట్రో ఫేజ్IV ప్రాజెక్టుల రెండు కారిడార్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు కారిడార్లకు 8,399 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రెండు కారిడార్ల దూరం 20.762 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు మార్చి 2029 నాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.


Also Read: ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన మాజీ సీఎం.. లోక్ సభ బరిలోకి దిగుతారా ?

లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. ఈ కొత్త మెట్రో లైన్ సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్లను కనెక్ట్ చేయనుంది. మొత్తం 8 స్టేషన్లను నిర్మించనున్నారు. మొత్తం ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 12.377 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉండనుంది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×