BigTV English

Pressure Cooker as a Iron Box: అక్కో నీకో దండం.. ప్రెషర్ కుక్కర్‌ని ఇలా కూడా వాడొచ్చాని ఇంతవరకు నాకు తెలిదే!

Pressure Cooker as a Iron Box: అక్కో నీకో దండం.. ప్రెషర్ కుక్కర్‌ని ఇలా కూడా వాడొచ్చాని ఇంతవరకు నాకు తెలిదే!

viral news


Cloth Iron with Pressure Cooker: అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు రెస్ట్ లేకుండానే గడిపేస్తారు కొందరు. ఉదయాన్నే కాఫీ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని పనులు వాళ్లే చేయాలి. టైమ్‌కు తింటున్నారో లేదో కూడా చూసుకోరు. కొందరైతే తెలివిగా పనులు తప్పించుకొని తిరుగుతుంటారు. మరికొందరైతే ఇంట్లో నానా హంగామా చేస్తూ.. చకచకా పనులు చేస్తుంటారు. వీళ్లు చేసే పనులు చూస్తుంటే కొన్ని సందర్భాల్లో.. ఈ రోజు ఏం జరుగుతుందో అనే సందేహాం కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో నవ్వకుండా ఉండలేము.

అయితే ఐరన్ ఎవరైనా ఎలా చేస్తారు. ఏంటి ఈ పిచ్చి ప్రశ్న అనుకుంటున్నరా? ఐరన్ ఏవరైనా ఐరన్ బాక్స్‌తోనే చేస్తారు. ఓపిక లేకుంటే బయట షాపులో ఇచ్చి ఐరన్ చేయించుకుంటారు. కానీ అమ్మాయిలు ఐరన్ ఎలా చేస్తారో తెలుసా? మీరు అనుకున్నట్లు వాళ్లు ఐరన్ బాక్స్‌తో చేయరు. మీకు తెలిసిన అమ్మాయిలు చేసినా.. ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయి మాత్రం ఐరన్‌కు ఐరన్ బాక్స్ ఉపయోగించదు.


తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్యర్యపోతారు. వీడియో చూసినట్లయితే ఓ అమ్మాయి ఎలక్ట్రిక్ స్టవ్‌పై కుక్కర్ పెట్టి ఉంటుంది. చూడగానే ఏదైనా వంట చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కొంత సమయం తర్వాత కుక్కర్ విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేస్తుంది. వెంటనే దాన్ని పట్టుకొని.. పక్కనే బెడ్‌పై ఉన్న ఆమె డ్రస్‌కు దానితో ఐరన్ చేస్తుంది.

Also Read: స్టేజ్ పై కొడుకు యాక్టింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి!

ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. @Babymishra_ అనే అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియోకు 273K వ్యూస్ ఉన్నాయి. ఇంకా ఇవి పెరిగే అవకాశం కూడా ఉంది. 1.1K మంది లైక్ చేశారు. 191 మంది రిపోస్ట్ చేశారు. 56 మంది కామెంట్ చేశారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఇలా ఐరన్ చేయడంపై మండిపడుతున్నారు. ఐరన్ కోసం ప్రెజర్ కుక్కర్ ఉపయోగించడం చాలా డేంజర్ అని కామెంట్ చేస్తున్నారు. ప్రెజర్ కుక్కర్ కొన్ని సందర్భాల్లో ప్రెజర్ ఎక్కువై బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పది రూపాలకోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అని హితవు పలుకుతున్నారు.

Also Read: ఓరేయ్.. ఇదేం ప్రేమరా బాబు.. ఇలా కూడా రోమాన్స్ చేసుకుంటారా..?

ఆ అమ్మాయి కావాలనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి వీడియో షూట్ చేసిందని మరికొందరు కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం ఇటువంటి పిచ్చిపనులు చేయకండని జాగ్రత్రలు చెబుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తలు మరచి ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా నేటి కాలంలో యువత టెక్నాలజీతో జీవిస్తున్నారు. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమై పోయింది. చాలామంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లైక్స్,షేర్ల కోసం ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. సోషల్ మీడియా,టెక్నాలజీని మన అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×