Narendra Modi: ప్రధాని మోడీ లైఫ్ ఓ జీవిత పాఠం. పొలిటికల్ సునామీ ఆయన. అంత మాత్రాన ఇది రాజకీయం కాదు. అంతకు మించిన పవర్. ఆయన దగ్గర మ్యాజిక్ ఉంది. జీవితమంతా నేర్చుకునే పాఠాలున్నాయ్. ఆయన సక్సెస్ ఫార్ములా ఎవరికీ అందదు. జీవితంలో ఇన్ సైడ్ స్టోరీలు, సక్సెస్ స్టోరీలు ఎన్నో. ఒక్కొక్కటి ఒక్కో లెస్సన్. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని ధీరుడాయన. వెనక్కు తిరిగి చూడని ధైర్యం ఆయన. అసలేంటి ప్రధాని మోడీ మ్యాజికల్ ఫార్ములా?
2001 నుంచి ఇప్పటిదాకా తిరుగులేని రికార్డ్
మహా అద్భుతం జరిగింది. ఇవి కొందరి జీవితాల్లోనే సంభవం. కార్యసాధకులనే విజయం వరిస్తుందంటారు కదా… అది మన ప్రధాని మోడీకి ముమ్మాటికీ సరిపోతుంది. గుజరాత్ సీఎంగా, భారత దేశ ప్రధానమంత్రిగా మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం అసాధారణం. గుజరాత్ అంటే వ్యాపారులు ఉంటారు.. వాళ్లకేం సమస్య ఉండదనుకుంటారు. కానీ చాలా మంది నాడు పేదరికంలో మగ్గిన వాళ్లూ ఉన్నారు. మోడీ గుజరాత్ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పుడు కథ మరోలా ఉంది. కానీ ఆయనే వికాస్ పురుష్ గా మారి గుజరాత్ చరిత్ర తిరగ రాశారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి దాకా భారత ప్రధానిగా తిరుగులేని రికార్డ్ మెయింటేన్ చేస్తున్నారు. ఇది ఈజీ టాస్క్ కాదు. ఇది సక్సెస్ ఫార్ములా. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీకి అమెరికా వీసా నిరాకరించింది. కానీ మోడీ దాన్ని తన గుజరాత్ మోడల్ తో అధిగమించారు. ఫారిన్ ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యారు. కథ మార్చేశారు. ఏదైతే వైట్ హౌజ్ కు రాకుండా చేశారో.. అదే వైట్ హౌజ్ మన మోడీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించింది. హోస్ట్ చేసింది. ఇదీ మోడీ మ్యాజిక్.
వైబ్రంట్ గుజరాత్ సదస్సుతో అద్భుతాలు
మోడీ గుజరాత్ సీఎంగా పని చేసిన 13 ఏళ్లలో రాష్ట్ర GDP రేట్ 10 శాతానికి పైగా చేరింది. వైబ్రంట్ గుజరాత్ పేరుతో మోడీ ఏర్పాటు చేయించిన సమ్మిట్లు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో.. అచ్చం అలాగే వైబ్రంట్ గుజరాత్ సదస్సుతో మోడీ ఆ రాష్ట్రానికి ఆ ఖ్యాతి తీసుకొచ్చారు. అప్పట్లో మిగిలిన రాష్ట్రాలు కూడా వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు హాజరై పెట్టుబడులు తెచ్చుకునేవి. అది మోడీ మార్క్. ఇది ఆయన ఆలోచనే. ఇండస్ట్రీలు బూస్టప్ అయ్యాయి. గ్రోత్ పెరిగింది. దీంతో గుజరాత్ వెనక్కు తిరిగి చూసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన సీఎంగా లేకపోయినా అక్కడ బీజేపీదే నాన్ స్టాప్ విజయం. అందుకు కారణం మోడీ వేసిన బలమైన పునాదులే.
చాయ్ అమ్మినా చిన్నతనంగా అనుకోలేదు..
మోడీ సక్సెస్ స్టోరీలో ఆయన తల్లి హీరా బెన్ ప్రభావం చాలా ఉంది. ఆవిడ మోడీకి చెప్పిన రెండు మాటలు ఈ విజయాలకు కారణం. ఒకటి పేదల కోసం పని చెయ్యు, ఎవరి దగ్గరా లొంగిపోవద్దు, చేయి చాచొద్దు.. ఇదే ఫార్ములా ఆయన్ను ముందుకు సక్సెస్ ఫుల్ గా నడిపించాయి. మోడీకి బలమైన నెట్‌వర్క్ బిల్డ్ చేసింది ఈ మాటలే. చిన్నప్పుడు చాయ్ అమ్మారు. ఎప్పుడూ దీన్ని తక్కువగా చెప్పుకోలేదు. పైగా దీన్నే ఎన్నికలప్పుడు ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు కదిలారు మోడీ. చాయ్ పే చర్చ అంటూ డిబేట్లు పెట్టించారు. విపక్షాల విమర్శలు, సంక్షోభాల నుంచి విజయాన్ని రాబట్టే పని ఇదే. RSS ప్రచారక్‌గా మొదలై, 2014 ఎన్నికల్లో అచ్చే దిన్ స్లోగన్‌తో BJPకి సింగిల్ మెజారిటీ వచ్చేలా మోడీ కీ రోల్ పోషించారు. 2014 క్యాంపెయిన్‌లో అమిత్ షాతో కలిసి 3D స్ట్రాటజీ అంటే డేటా, డైరెక్ట్ కాంటాక్ట్, డెవలప్‌మెంట్ ప్రయోగించారు. నాడు మోడీ మేనియా దేశమంతా బీజేపీకి ఒక బలమైన ఊపు తీసుకొచ్చింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో మోడీకి కోట్లాది మంది ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే చిన్న మాటలా.
2001 నుంచి 2024 దాకా వరుసగా గెలవడం మాటలా?
ఒకసారి గెలిస్తే ఏదో ఊపు ఉంది కాబట్టి గాలికి గెలిచారు అనుకోవచ్చు. కానీ 2001 నుంచి 2024 ఎన్నికల దాకా వరుసగా గెలవడం అంటే మాటలా..? పైగా దేశంలో ఎవరికీ సాధ్యం కాని విషయం. అందుకే మోడీ ది గ్రేట్ అని వరల్డ్ లీడర్స్ అనేది. ట్రంప్ నోట కూడా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని తరచూ మోడీ గురించి చెబుతారంటే అది ఆయన మ్యాజిక్కే. మొన్నటికి మొన్న మోడీ బర్త్ డే సందర్భంగా అగ్రదేశాధి నేతలు స్వయంగా వీడియో రికార్డ్ చేయించుకుని మరీ విజువల్ విషెస్ చెప్పారు. ఎంత పవర్ ఫుల్ కాకపోతే అలా చేస్తారు. ఏదో బర్త్ డే పోస్ట్ పెట్టి వదిలేయొచ్చు. కానీ అలా జరగలేదు. పదవి వచ్చింది.. పవర్ చూపిద్దాం.. హంగూ ఆర్భాటాలు మెయింటేన్ చేద్దాం.. అందరినీ గుప్పిట్లో తీసుకుందాం.. జనానికి దూరంగా ఉందాం.. ఇలాంటి ఆలోచన చేయలేదు కాబట్టే మోడీ ఇంకా లీడర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికీ రోజూ 18 గంటలు పని చేసే మనస్తత్వం. ఈ గ్యాప్ లోనే మన్ కీ బాత్ లాంటి రేడియో షోతో ప్రజలతో కనెక్ట్ అవడం ఆయన సీక్రెట్.
చాయ్ వాలా స్టోరీ గ్లోబల్ లీడర్‌షిప్ దాకా ఎలా వెళ్లింది? పాలిటిక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కు నిదర్శనం ఎలా అయ్యింది? యోగా, మెడిటేషన్‌తో మానసిక ఆరోగ్యాన్ని ఫోకస్ చేస్తారు. సరైన డైట్ తో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. చేసే ప్రతి పనికి బ్రాండింగ్ ఇచ్చుకుంటారు. ఇవన్నీ సక్సెస్ ఫార్ములానే. నోట్ల రద్దు ఫెయిల్ అన్న వారే ఆ తర్వాత భేష్ అన్నారు. దాన్నుంచి కూడా 2019లో విజయం సాధించి పెట్టారు. ఇదే మోడీ మ్యాజిక్.
జనంతో కనెక్షన్, విజన్ ఉండడం ప్లస్
బయటి నుంచి చూసిన వారిలో కొందరికి.. మోడీ ఏదో గాల్లో గెలుస్తున్నారు.. మతం కార్డు ప్రయోగిస్తున్నారు అనుకోవచ్చు. అది ముమ్మాటికీ నిజం కాదు అని నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒకసారి కాకపోయినా మరోసారి ఓడిపోవాలి కదా. అది జరగలేదు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రధాని మంత్రి దగ్గర క్రైసిస్ మేనేజ్ మెంట్ ఉంది. విజన్ ఉంది. అంతకు మించి జనంతో కనెక్షన్ ఉంది. కోవిడ్ టైంలో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. ప్రపంచదేశాలకు పంపించారు. ఇందులో సంక్షోభాన్ని సవాల్ గా తీసుకోవడం చూడొచ్చు. వికసిత్ భారత్ 2047, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా విజన్ చూడొచ్చు. జనంతో నేరుగా ఇంటరాక్షన్స్ ద్వారా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం ద్వారా కనెక్టివిటీ ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
మూడోసారి మిత్రపక్షాల సపోర్ట్‌తో పగ్గాలు..
మనది ప్రజాస్వామ్యం. ఎవరైనా లీడర్ వరుసగా సీఎం, పీఎం అవుతుంటే.. జనాలు ఓటుతో మార్చేస్తారు. కొత్తవాళ్లు ఎలా పరిపాలన చేస్తారో చూద్దాం అనుకుంటారు. కానీ మోడీ విషయంలో అలా కాదు. 2024 ఎన్నికల్లో BJP సొంతంగా మెజారిటీ కోల్పోయినా, NDA పక్షాల సపోర్ట్ తో ముచ్చటగా మూడో టర్మ్ ప్రధాని పగ్గాలు చేపట్టారు. అదీ మోడీ సత్తా. ప్రధాని మోడీ పొలిటికల్ లైఫ్ లో చాలా ట్విస్టులు, సవాళ్లు స్వాగతం పలికాయి. అల్లర్లైనా, ఎకనామిక్ హీట్ అయినా, కోవిడ్ లాంటి ప్రపంచ సంక్షోభమైనా అన్నిటినీ తన మార్క్, తన పర్ఫార్మెన్స్ తో టర్న్ చేశారు మోడీ.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో ప్లేస్‌లో భారత్
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్‌లో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇది Purchasing Power Parity ప్రకారం 3వ స్థానం కూడా. ఇది జపాన్‌ను మించి 2025 మధ్యలో సాధించిన విజయం. వీటితో పాటే దేశ ప్రజలకు దీపావళి ముందుగానే తీసుకొచ్చారు. జీఎస్టీ రిఫామ్స్ చేశారు. రెండే శ్లాబులు ఉంచారు. దీంతో మధ్యతరగతి నేస్తం అయ్యారు మోడీ. ఇప్పుడు ఎన్నికలు లేవు.. ఏమీ లేవు.. అయినా సరే జనం కోసం ఎప్పుడు ఏం చేయాలో మోడీకి బాగా తెలుసు. అందుకే ఆయన ఈ తరం భారత దేశపు నాయకుడే కాదు.. గ్లోబల్ లీడర్ అయ్యారు. ఇది నాలుగు మాటలు చెబితే సాధ్యమవుతుందా?
కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..
మోడీ తత్వం నేషన్ ఫస్ట్. అది కూడా జనంలో బాగా పని చేసింది. దేశం కంటే ఎవరు గొప్ప. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని ఓ సందర్భంగా గురజాడ మాటను కూడా ఏపీకి వచ్చినప్పుడు మాట్లాడారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్ర భాషలో మొదటగా అందరినీ పలకరించడం అలవాటు చేసుకున్నారు. రోజూ ఉదయం చేసే మెడిటేషనే మోడీ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సీక్రెట్. కష్టపడి పని చేసి, దాన్ని ప్రపంచానికి చూపించాలి. ఇదే మోడీ చేశారు. గెలిచారు. నిలిచారు. గెలుస్తూనే ఉన్నారు.
Story By Vidya Sagar, Bigtv