Earthquake: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన భారీ భూకంపం ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. దేశంలోని మిందానావో ప్రాంతంలోని దావో ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలో.. సముద్ర గర్భంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పరిణామంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత, ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని గంటల్లో సునామీ ప్రభావం ఉండవచ్చరి హెచ్చరిక..
మనాయ్ పట్టణానికి తూర్పున సుమారు 62 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం ఉండవచ్చని ఫివోల్క్స్ హెచ్చరించింది.
Also Read: ఎదురెదురుగా ఢీ కొన్న బస్సులు.. స్పాట్‌లో 10 మంది
తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికల జారీ
మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం కూడా భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలను ప్రమాదకరమైన సునామీ అలలు తాకే ముప్పు ఉందని తెలిపింది. రాబోయే రెండు గంటల్లో పసిఫిక్ తీరంలో దాదాపు ఒక మీటరు ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ సీస్మాలజీ కార్యాలయం అంచనా వేసింది.