EPFO Tagline Contest: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నుంచి రూ. 21,000 గెలుచుకునే సదవకాశం వచ్చింది. ఈపీఎఫ్ఓ ట్యాగ్‌లైన్ పోటీని ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ సేవల్లోని సామాజిక భద్రత, నమ్మకం, సాధికారత విలువలను ప్రతిధ్వనించే విధంగా ట్యాగ్‌లైన్‌ను సృష్టించాలని సూచించింది. ఈ ట్యాగ్ లైన్ పెన్షన్ ఫండ్ సంస్థ గుర్తింపునకు దోహదపడే విధంగా ఉండాలని కోరింది.
ఈ ట్యాగ్ లైన్ ను MyGov వెబ్ సైట్ ద్వారా నమోదు చేయాలని ఈపీఎఫ్ఓ కోరింది. సామాజిక భద్రతను గుర్తుచేసేలా, శ్రామిక శక్తిని శక్తివంతం చేయడం, పీఎఫ్ సభ్యులందరికీ ఆర్థిక భద్రతను పెంపొందించడం అనే ఈపీఎఫ్ఓ లక్ష్యం, స్ఫూర్తిని తెలియజేసేలా ఈ ట్యాగ్ లైన్ ఉండాలని ఈపీఎఫ్ఓ MyGov వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ట్యాగ్ లైన్ పోటీలో టాప్ లోని ముగ్గురికి బహుమతులు ఇస్తారు.
విజేతలకు ఈపీఎఫ్ఓ నుండి ప్రశంసా పత్రం, ప్రధాన కార్యాలయంలో జరిగే వ్యవస్థాపక దినోత్సవానికి ఇన్విటేషన్ కూడా లభిస్తుంది. వారికి హోటల్ బసతో పాటు రైల్ ఛార్జీ (సెకండ్ AC) కూడా ఇస్తారు. పోటీలో పాల్గొనేవారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: BSNL Offer: రూ.107 నుంచే BSNL బడ్జెట్ ప్లాన్.. డేటా, కాల్స్, SMS అన్ని ఫ్రీ