UP Governor: ఒకప్పుడు సరైన వయస్సులో తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేసేవారు. ఇప్పుడు చదువులు, ఉద్యోగుల వేటలో పెళ్లిళ్లకు దూరమవుతున్నారు. ఇది అనేక అనర్థాలకు దారితీస్తోంది. ఇటీవలకాలంలో దేశంలో కొత్త ట్రెండ్ మొదలైంది. రోజురోజుకూ సహజీవనం కాన్సెప్ట్ విస్తరిస్తోంది. దీనిమాటున అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ యువతులను సున్నితంగా హెచ్చరించారు.
యూపీ గవర్నర్ సున్నితమైన వార్నింగ్
ఇటీవలకాలంలో యూపీతోపాటు మిగతా రాష్ట్రాల్లో అమ్మాయిలు, మహిళలు దారుణ హత్యలకు గురవుతున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా సహజీవనం అనేది చాలా కేసుల్లో బయటపడుతుంది. దీన్ని గమనించిన యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం అమ్మాయిలు సహజీవనానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
లివ్-ఇన్ రిలేషన్షిప్స్ అనేది ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారడంతో 15 నుంచి 20 ఏళ్ల మధ్యలో పిల్లలను కంటున్నారు. ఆడబిడ్డలు ఇలా చేయడం చాలా బాధగా ఉందన్నారు. సహజీవనానికి దూరంగా ఉండాలని, లేకపోతే మీరు 50 ముక్కలై దొరుకుతారని సున్నితంగా హెచ్చరించారు. బుధవారం వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.
సహజీవనం వద్దు, ముక్కలువుతారు
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, సమాజంలో రోజురోజుకూ మహిళలపై పెరుగుతున్న హింస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్. మహిళా విద్యార్థులు వ్యక్తిగత జీవితాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. సహజీవనం వంటి అంశాలకు దూరంగా ఉంటే బెటరన్నారు.
సహజీవనం అనేది ప్రస్తుతం ఫ్యాషన్‌లో కావచ్చని, అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు గవర్నర్. మీ జీవితం గురించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని, సమాజంలో ఏమి జరుగుతుందో చూస్తున్నామని అన్నారు. గడిచిన 10 రోజులుగా వీటికి సంబంధించి కేసుల నివేదికలు వస్తున్నాయని, వాటిని చూసిన ప్రతిసారీ తనకు బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు.
ALSO READ: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు
అదే సమయంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. బాధిత బాలికలను తాను వ్యక్తిగతంగా కలిశానని గుర్తు చేశారు. ఇలాంటి సంబంధాల బారిన పడకుండా మహిళా విద్యార్థులు అవగాహన పెంచాలని అన్ని విశ్వవిద్యాలయాలను కోరినట్టు చెప్పుకొచ్చారు.
మంగళవారం జననాయక్ చంద్రశేఖర్ విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అప్పుడు ఆమె చేసిన ఆ తరహా వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. సహజీవనం వల్ల కలిగే పరిణామాలను చూడాలనుకుంటే ఓ అనాథాశ్రమాన్ని సందర్శించాలన్నారు. 15 నుండి 20 ఏళ్ల బాలికలకు ఏడాది వయసున్న బిడ్డ ఉన్నారని చెప్పిన సంగతి తెల్సిందే.
లివ్-ఇన్ రిలేషన్షిప్ వద్దు.. 50 ముక్కలవుతారు: గవర్నర్
నేటి తరం అమ్మాయిలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు దూరంగా ఉండాలని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పిలుపునిచ్చారు. 'లివ్-ఇన్ రిలేషన్షిప్స్ ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారింది. 15-20 ఏళ్ల యువతులు బిడ్డలను కంటున్నారు. మన ఆడబిడ్డలు ఇలా… pic.twitter.com/9gp0u7fzha
— ChotaNews App (@ChotaNewsApp) October 10, 2025