E-Paper
Advertisement

Delhi: వాహన యజమానులకు శుభవార్త, తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు

Delhi: వాహన యజమానులకు శుభవార్త,  తెరపైకి కొత్త ప్రతిపాదనలు, ఇకపై మూడేళ్లు
Advertisement

Delhi: వాహన యజమానులకు శుభవార్త చెప్పనుంది కేంద్రం. ఉద్యోగం లేకుంటే వ్యాపారాలు, వివిధ కారణాలతో వేర్వేరు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు చాలామంది వాహన యజమానులు. వారి కోసం కొత్త నిబంధనలు తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. అదే జరిగితే ఐటీ ఉద్యోగులకు వరంగా మారనుంది. అసలు విషయం ఏంటి?

వాహన యజమానులకు శుభవార్త-కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు, రకరకాల కారణాలతో పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. పైన చెప్పిన వారిలో టూ వీలర్స్ లేకుంటే కార్లు యజమానులు ఎక్కువగా ఉన్నారు. వారి కోసం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్ నిబంధనలో మార్పులు తీసుకురావాలని ఆలోచన చేస్తోంది.

Advertisement

తెరపైకి కొత్త ప్రతిపాదనలు తెచ్చిన కేంద్రం-చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం.. అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలను మరో రాష్ట్రంలో ఏడాది పాటు హ్యాపీగా తిరగవచ్చు. అంతకంటే ఎక్కువ కాలం కొనసాగితే ఉండే రాష్ట్రాన్ని బట్టి రోడ్ ట్యాక్స్ చెల్లించి తిరిగి వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి.  ఉద్యోగులు, వ్యాపారులు, జాబుల నిమిత్తం తరచూ బదిలీలు అయ్యేవారికి ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందిగా మారింది.

ఇకపై మూడేళ్లు రిజిస్ట్రేషన్ వ్యవధి- ఈ క్రమంలో ప్రస్తుత రిజిస్ట్రేషన్‌తో వాహనాలను ఇతర రాష్ట్రాల్లో గరిష్టంగా మూడేళ్ల పాటు వినియోగించుకునే ప్రతిపాదనను పరిశీలిస్తోందట కేంద్రప్రభుత్వం. ఈ మార్పు అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహన యజమానులు మళ్లీ రీ-రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఖర్చు  తగ్గనుంది.

Advertisement

ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్-ఈ ప్రతిపాదన వల్ల కేంద్ర-ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు, బదిలీలు అయ్యేవారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ పద్దతి వల్ల రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. పరిపాలనా భారాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. కొత్త ప్రతిపాదనపై అధికారిక ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం.

ALSO READ: విచిత్రమైన పెళ్లి.. కేవలం ఒక్క రూపాయి, ఇంతకీ ఎక్కడో తెలుసా? 

నిబంధనల్లో మార్పులకు ఆమోదం లభించిన తర్వాత కొత్త విధానం అమల్లోకి రానుంది. గతవారం మంత్రుల సమావేశంలో మోటార్ వాహనాల చట్టానికి సవరణల ముసాయిదా ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో వాహనం రిజిస్ట్రేషన్ నమోదు చేసినవారు అనేక కారణాల వల్ల రెండు లేదా మూడేళ్లు పొరుగు రాష్ట్రంలో ఉంటున్నారు.

తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చినవారికి రద్దు చేసుకోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. అర్హులైన వాహన యజమానులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అన్ని రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయాణించడానికి అనుమతించే భారత్ సిరీస్- BH రిజిస్ట్రేషన్‌కు చేయవచ్చని కేంద్ర రవాణా విభాగంలో పని చేసే ఓ అధికారి తెలిపారు.

Related News

పాట్నాలో భగ్గుమన్న విద్యార్థులు.. BPSC అక్రమాలపై సమరం.. ఉద్రిక్తంగా మారిన సీఎం ఇంటి ముట్టడి!

మహిళా SI పై ఎమ్మెల్యే కూతురు దాడి.. ఇంత దారుణమా? సీసీటీవీ సాక్షిగా, ఇదిగో వీడియో, ఏం జరిగింది?

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. 2,482 ఉద్యోగ ఖాళీలు.. రూ.80,000 వరకు సాలరీ

వీడొక పరమనీచుడు.. భార్య ఏకాంత వీడియోలు అందులో పెట్టి.. ఆ తర్వాత ఏం చేశాడంటే

ప్రియురాలితో 3400 సార్లు ముద్దులు.. చిక్కుల్లో ప్రియుడు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? వీడియో వైరల్

కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!

జాయ్ రైడ్‌లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!

సీజేపీ సంచలన ప్రకటన.. మళ్లీ ఢిల్లీలో నిరసనలు.. కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×