E-Paper
Advertisement

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 15 మంది

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 15 మంది
Advertisement

Pune Collapse: మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే పుణె సమీపంలో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

శిథిలాల కింద 15 మంది!

Advertisement

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి పుణె పరిసర ప్రాంతమైన పింప్రి-చించ్వాడ్‌లో ఒక మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సుమారు 15 మంది వరకు ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించి, లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: రూ.37 వేల కోట్లు ఇచ్చాం.. మరి ధాన్యం ఏవి? తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి!

Advertisement

6 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

పుణె, పింప్రి-చించ్వాడ్ పరిసరాల్లో వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. దాదాపు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించింది. బాధితులకు అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను అధికారులు అందిస్తున్నారు.

విద్యాసంస్థల బంద్.. రెడ్ అలర్ట్ జారీ

వాతావరణ శాఖ (IMD) రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు పుణె, పింప్రి పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితంగా ఉండాలని యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది.

Related News

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

Big Stories

Advertisement
×