E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది.. తాటిచెట్టుకు ఇనుప మెట్లా? ఈ రైతు తెలివికి సెల్యూట్!

ఇదేందయ్యా ఇది.. తాటిచెట్టుకు ఇనుప మెట్లా? ఈ రైతు తెలివికి సెల్యూట్!
Advertisement

Palm Tree Steps: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన వినూత్న ప్రయోగంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. సత్తన్‌కులం సమీపంలోని సలైపుత్తూరు గ్రామానికి చెందిన దినకర్ అనే రైతు.. ఎంతో కష్టతరమైన తాటి చెట్టు ఎక్కే ప్రక్రియను సులభతరం చేశారు. సాంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేస్తూ ఆయన చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

తండ్రి కోసం వినూత్నంగా..

దినకర్ కుటుంబం తరతరాలుగా తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తోంది. అయితే, ఆయన తండ్రి ఏసుదాసన్ (70) వృద్ధాప్యం కారణంగా తాటి చెట్లు ఎక్కడం మానేయాల్సి వచ్చింది. కుటుంబ వృత్తిని కొనసాగించాలనే బలమైన కోరిక, తండ్రిపై ఉన్న ప్రేమ దినకర్‌ను ఏదైనా కొత్తగా ఆలోచించేలా చేశాయి. తాటి చెట్లు ఎక్కడం అనేది శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న పని అయినందున ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే లక్ష్యంతో దినకర్ ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు.

రూ.60 వేల ఖర్చుతో మెట్లు

Advertisement

చెట్టును ఎక్కడం ఎంత కష్టమో తెలిసిన దినకర్.. దానికి పరిష్కారంగా ఏకంగా చెట్టు చుట్టూ ఇనుప మెట్లను నిర్మించారు. సుమారు 55 అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్టు చుట్టూ వంపు తిరిగిన ఇనుప రాడ్లతో ఈ మెట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయన సుమారు రూ.60,000 ఖర్చు చేశారు. చిన్న పిల్లల నుండి మహిళల వరకు ఎవరైనా.. ఎలాంటి భయం లేకుండా సులువుగా తాటి చెట్టు పైకి చేరుకునేలా ఇది ఉపయోగపడుతుంది. ఎంతో ఈజీగా తాటికల్లు లేదా పదనీరు (Pathaneer) సేకరించేందుకు వీలు కల్పిస్తోంది.

ఏడాదిలో పెట్టుబడి రిటర్న్

Advertisement

అయితే చెట్లకు ఇనుప మెట్లు అమర్ఛడాన్ని ఒక ఖర్చుగా కాకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడిగా దినకర్ భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ నిరంతరాయంగా తాటికల్లు సేకరించే అవకాశం లభించినట్లు ఆయన చెబుతున్నారు. ఇనుప మెట్ల వల్ల శ్రమ తగ్గడమే కాకుండా.. నిరంతరం తాటి కల్లు సేకరించడం ద్వారా ఏడాదిలోనే పెట్టిన పెట్టుబడి (రూ.60,000) అంతా తిరిగి వచ్చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: మోటో నుంచి కొత్త ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 3 రోజులు పక్కా!

15 ఏళ్లపాటు కాసుల వర్షం

సాధారణంగా ఒక తాటి చెట్టు దశాబ్దాల పాటు దిగుబడిని ఇస్తుందని దినకర్ గుర్తుచేస్తున్నారు. ఫలితంగా రాబోయే 15 ఏళ్ల పాటు ఈ నిర్మాణం ద్వారా తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చని వివరిస్తున్నారు. కాగా, సాంప్రదాయ వృత్తికి ఆధునిక ఆలోచనలను జోడించి, కష్టాన్ని సుఖంగా మార్చుకున్న దినకర్.. నేటి తరం రైతులకు ఒక కొత్త మార్గాన్ని చూపించారని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా సాధించవచ్చో ఆయన చేసి చూపిస్తుండటం విశేషం.

Also Read: అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

Related News

పాట్నాలో భగ్గుమన్న విద్యార్థులు.. BPSC అక్రమాలపై సమరం.. ఉద్రిక్తంగా మారిన సీఎం ఇంటి ముట్టడి!

మహిళా SI పై ఎమ్మెల్యే కూతురు దాడి.. ఇంత దారుణమా? సీసీటీవీ సాక్షిగా, ఇదిగో వీడియో, ఏం జరిగింది?

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. 2,482 ఉద్యోగ ఖాళీలు.. రూ.80,000 వరకు సాలరీ

వీడొక పరమనీచుడు.. భార్య ఏకాంత వీడియోలు అందులో పెట్టి.. ఆ తర్వాత ఏం చేశాడంటే

ప్రియురాలితో 3400 సార్లు ముద్దులు.. చిక్కుల్లో ప్రియుడు, ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? వీడియో వైరల్

కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!

జాయ్ రైడ్‌లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!

సీజేపీ సంచలన ప్రకటన.. మళ్లీ ఢిల్లీలో నిరసనలు.. కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×