E-Paper
Advertisement

ఇల్లు చిన్నదా? బడ్జెట్ తక్కువా? అయితే.. ఈ వాషింగ్ మెషీన్స్ లిస్ట్ మీ కోసమే!

ఇల్లు చిన్నదా? బడ్జెట్ తక్కువా? అయితే.. ఈ వాషింగ్ మెషీన్స్ లిస్ట్ మీ కోసమే!
Advertisement

Best small washing machine 2026: ఈ రోజుల్లో మెట్రో సిటీస్‌లో ఉండే ఫ్లాట్లు లేదా రూమ్‌లు చాలా చిన్నగా ఉంటున్నాయి. దాంతో పెద్ద పెద్ద వాషింగ్ మెషీన్లు పెట్టడానికి ప్లేస్ సరిపోదు. పైగా బ్యాచిలర్స్, వర్కింగ్ కపుల్స్ లేదా హాస్టల్స్ లో ఉండేవారికి రోజువారీగా కొన్ని బట్టలు ఉతకడానికి పెద్ద మెషీన్ అవసరం లేదు. అలాంటి వారి కోసం ‘స్మాల్ అండ్ కాంపాక్ట్’ వాషింగ్ మెషీన్లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి తక్కువ ప్లేస్ ఆక్రమించడమే కాకుండా.. కరెంట్, వాటర్ బిల్లులను కూడా భారీగా తగ్గిస్తాయి.మార్కెట్లో బెస్ట్ రేటింగ్ ఉన్న 5 చిన్న వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 స్మాల్ & కాంపాక్ట్ వాషింగ్ మెషీన్స్:

1.డిఎమ్‌ఆర్ 3 కేజీ పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్ (DMR 3kg Portable Mini Washer):

మీకు చాలా చిన్న సైజ్, అవసరమైతే జర్నీలో.. కూడా కార్ డిక్కీలో తీసుకెళ్లే వాషింగ్ మెషీన్ కావాలంటే DMR బెస్ట్ ఛాయిస్. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ పోర్టబుల్ మెషీన్. 3 కేజీ కెపాసిటీ (ఒకేసారి 5-6 బట్టలు ఉతకవచ్చు) దీనిలో ఉంటుంది. కాబట్టి కేవలం 240 వాట్స్ పవర్ మాత్రమే తీసుకుంటుంది. ఇందులో 15 నిమిషాల వాష్ టైమర్ ఉంటుంది. హాస్టల్ స్టూడెంట్స్, సింగిల్ పర్సన్స్ ,చిన్న పిల్లల బట్టలు విడిగా ఉతకడానికి ఇది పర్ఫెక్ట్. దీని ధర సుమారు రూ.5,499

2. వర్ల్‌పూల్ 6 కేజీ సూపర్‌బ్ ఆటమ్ (Whirlpool 6 Kg Superb Atom 60I):

Advertisement

చిన్న ఫ్యామిలీస్ లేదా ఇద్దరు రూమ్‌మేట్స్ కోసం కాస్త గట్టిగా, ఎక్కువ రోజులు మన్నే బ్రాండెడ్ మెషీన్ కావాలంటే వర్ల్‌పూల్ 6 కేజీ సెమీ-ఆటోమేటిక్ మెషీన్ అద్భుతంగా పనిచేస్తుంది. 6 కేజీ కెపాసిటీ, 1400 RPM పవర్‌ఫుల్ మోటార్ వల్ల బట్టలు చాలా వేగంగా ఆరిపోతాయి. ఇందులో స్మార్ట్ స్క్రబ్ స్టేషన్ కూడా ఉంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ , ఎక్కువ బట్టలు ఉతికే చిన్న ఫ్యామిలీస్ కోసం ఇది బెస్ట్ అనే చెప్పాలి. దీని ధర రూ.8,990 వరకు ఉంటుంది.

3. శామ్‌సంగ్ 6 కేజీ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ (Samsung 6 Kg Fully Automatic – WA60M4100HY):

బట్టలు వేసి బటన్ నొక్కితే చాలు.. ఉతకడం, ఆరబెట్టడం అన్నీ అదే చూసుకోవాలి అనుకుంటే శామ్‌సంగ్ కంపెనీ వారి ఈ 6 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్ బెస్ట్ ఆప్షన్. ఇది సైజులో చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. డైమండ్ డ్రమ్ టెక్నాలజీ వల్ల బట్టలు అస్సలు పాడవవు. ఈకో టబ్ క్లీన్, చైల్డ్ లాక్ , మ్యాజిక్ ఫిల్టర్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. వర్కింగ్ కపుల్స్ , తక్కువ స్పేస్ ఉన్న మోడ్రన్ ఫ్లాట్స్ కోసం ఇది బెస్ట్ అనే చెప్పాలి. దీని ధర రూ.13,490 ఉంటుంది.

4. ఒనిడా వాషర్ ఓన్లీ 6.5 కేజీ (Onida Washer Only – WS65WLPT1LR):

Advertisement

మాకు డ్రైయర్ (ఆరబెట్టేది) అవసరం లేదు. కేవలం బట్టలు బాగా ఉతికే చిన్న మెషీన్ తక్కువ ధరలో కావాలి అనుకునేవారికి ఒనిడా బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం వాషర్ మాత్రమే. ఇది 6.5 కేజీ కెపాసిటీ ఉన్నా మెషీన్ చాలా లైట్ వెయిట్ ,కాంపాక్ట్‌గా ఉంటుంది. దీని పవర్‌ఫుల్ పల్సేటర్ మొండి మరకలను కూడా ఈజీగా వదిలిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బట్టలు ఉతకాలనుకునే.. బ్యాచిలర్స్ లేదా రూమ్‌మేట్స్ కోసం ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలి. దీని ధర సుమారు రూ.6,500 నుంచి రూ. 7,200 వరకు ఉంటుంది.

Also Read: ఓర్నాయనో.. ఒక్క ఛార్జ్‌తో వంద గంటలా ?బడ్జెట్లో టాప్ 5 నెక్ బ్యాండ్స్ ఇవే!

5. రోమినో 3 కేజీ ఫోల్డబుల్ మినీ వాషింగ్ మెషీన్ (Romino 3KG Foldable Mini Washer):

ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రేజీ గ్యాడ్జెట్. బకెట్ లాగా ఉండే ఈ మెషీన్‌ను వాడేసిన తర్వాత మడతబెట్టి (Fold చేసి) మంచం కింద లేదా కప్‌బోర్డ్‌లో పెట్టేయవచ్చు. స్పేస్ సేవింగ్‌లో దీనికి తిరుగులేదు. 3 కేజీ కెపాసిటీ, ఫోల్డబుల్ డిజైన్, సింగిల్ టచ్ కంట్రోల్ , స్పిన్ డ్రై ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ట్రావెలర్స్, క్యాంపింగ్ చేసేవారు, సాక్స్, చిన్నపిల్లల బట్టలు మాత్రమే ఉతకాలనుకునే వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి.
దీని ధర సుమారు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది.

చిన్న వాషింగ్ మెషీన్ల వల్ల స్థలమే కాదు, డబ్బు కూడా ఆదా అవుతుంది. మీ అవసరం కేవలం చిన్న పిల్లల బట్టలు లేదా సింగిల్ పర్సన్ కోసం అయితే DMR లేదా Romino ఫోల్డబుల్ మెషీన్ తీసుకోండి. అలా కాకుండా రోజువారీ జీన్స్, బెడ్‌షీట్స్ కూడా ఉతకాలి అనుకుంటే Whirlpool 6kg లేదా Samsung Fully Automatic వైపు వెళ్లడం మంచిది. మీ అవసరానికి తగ్గ మెషీన్‌ను సెలెక్ట్ చేసుకొని, బట్టలు ఉతికే కష్టాలకి బై-బై చెప్పేయండి.

Related News

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Big Stories

Advertisement
×