E-Paper
Advertisement

హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?

హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?
Advertisement

Hotel Glass Bathrooms: సాధారణంగా చాలా హోటల్‌ రూమ్స్‌లో ఉండే బాత్‌రూమ్‌లకు గోడలకు బదులుగా పారదర్శకమైన గ్లాస్ (గాజు) ఉండటం మనలో చాలామంది గమనించే ఉంటాం. చూడటానికి ఇవి చాలా మోడ్రన్‌గా అనిపించినప్పటికీ.. ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) ముఖ్యం అనుకునేవారికి మాత్రం కాస్త ఇబ్బందిగా, వింతగా అనిపిస్తుంది. అయితే, హోటల్స్ ఇలా డిజైన్ చేయడం వెనుక కేవలం అందం మాత్రమే కాదు.. చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేటంటే..

చిన్న గదిని పెద్దగా చూపించడం:

సిటీల్లో ఉండే హోటల్ రూమ్‌లు చాలావరకు పరిమితమైన స్థలంలో ఉంటాయి. అక్కడ సిమెంట్ గోడలు కడితే రూమ్ మరింత చిన్నగా, ఇరుకుగా అనిపిస్తుంది. అదే గ్లాస్ వాల్స్ పెట్టడం వల్ల రూమ్ అంతా ఒకేలా తెరిచినట్టు అనిపించి, కాస్త పెద్దదనే భ్రమను కల్పిస్తుంది. ఇరుకుదనం పోయి రూమ్ విశాలంగా కనిపించడం కోసమే ఈ ట్రిక్ ప్లే చేస్తారు.

సహజమైన వెలుతురు కోసం:

Advertisement

సాధారణంగా హోటల్ బాత్‌రూమ్‌లకు విడిగా కిటికీలు ఉండవు. దీంతో పగటిపూట కూడా లైట్లు వేయాల్సి వస్తుంది. అదే గ్లాస్ ప్యానెల్స్ ఉంటే.. మెయిన్ రూమ్ కిటికీల గుండా వచ్చే సహజమైన సూర్యకాంతి బాత్‌రూమ్‌లోకి కూడా వస్తుంది. ఇది రూమ్‌కు మంచి లుక్ ఇవ్వడమే కాకుండా, పగటిపూట కరెంట్ వాడకాన్ని తగ్గించి హోటల్స్ యాజమాన్యానికి విద్యుత్ ఆదా చేయడంలో సహాయపడుతుంది.

Also Read: 6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్‌లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

లగ్జరీ లుక్, ఈజీ మెయింటెనెన్స్:

Advertisement

గాజు గోడలు రూమ్‌కు ఒక రకమైన ప్రీమియం, స్పా లాంటి లగ్జరీ లుక్‌ను తీసుకొస్తాయి. ఆధునిక కాలంలో ఇదొక ట్రెండ్‌గా మారింది. దీనికి తోడు.. సాధారణ గోడలపై తేమ వల్ల పెయింట్ ఊడిపోవడం, బూజు పట్టడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ గ్లాస్ వాల్స్‌ను క్లీన్ చేయడం చాలా సులువు. తక్కువ శ్రమతోనే బాత్‌రూమ్‌ను ఎప్పుడూ నీట్‌గా ఉంచడానికి ఇది వీలవుతుంది.

ప్రైవసీ కోసం ఆధునిక టెక్నాలజీ:

గ్లాస్ బాత్‌రూమ్ అనగానే అందరికీ వచ్చే మొదటి అనుమానం ప్రైవసీ. అయితే హోటల్స్ దీనికి కూడా ప్రత్యామ్నాయాలు ఇస్తున్నాయి. అన్నిచోట్లా పూర్తిగా కనిపించే గ్లాస్ వాడరు. కొన్నిచోట్ల ఫ్రాస్టెడ్ (మసక) గ్లాస్ వాడితే.. మరికొన్ని లగ్జరీ హోటల్స్‌లో ఒక బటన్ నొక్కగానే పారదర్శక గాజు కాస్తా వైట్‌గా మారిపోయే స్మార్ట్ గ్లాస్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇంకొన్ని చోట్ల లోపలి వైపు స్క్రీన్స్ లేదా కర్టెన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా రూమ్‌ను స్టైలిష్‌గా మార్చడానికే హోటల్స్ ఈ విధానాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాయి.

Also Read: ఐఫోన్ కాదు బాస్.. యాపిల్ నుంచి ఊహించని ‘విజువల్’ గ్యాడ్జెట్.. అసలు ఆట 2027 లోనే!

Related News

డెవలపర్లు, క్రియేటర్ల కోసం హెచ్‌పీ సూపర్ ఏఐ ల్యాప్‌టాప్ విడుదల

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ షురూ..స్మార్ట్‌ఫోన్లు,గాడ్జెట్లపై కళ్లు చెదిరే ఆఫర్లు

మాప్ తానే ఉతికి ఆరబెట్టుకునే రోబో వాక్యూమ్ క్లీనర్..హైయర్ సివిక్ ఏఐ మ్యాక్స్ లాంచ్!

నథింగ్ బడ్స్‌కు చెక్ పెట్టేలా JBL కొత్త స్ట్రాటజీ..ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కొత్త మోడల్ లాంచ్!

మీ ఇంటినే..మూవీ హాల్‌గా మార్చే బెస్ట్ వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్

కరెంట్ బిల్లు సగానికి తగ్గించే టాప్ 5 స్టార్ గీజర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ధరల్లో భారీ తేడా ఇదే!

ఆఫీస్ డెస్క్‌పై వేడివేడి టీ,కాఫీ కావాలా? రూ.వెయ్యిలోపు ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇవే!

ఏఐ ఎఫెక్ట్.. 10 వేల ఉద్యోగాలకు ఎసరు, ఏ కంపెనీ తెలుసా?

Big Stories

Advertisement
×