E-Paper
Advertisement

చాయ్‌వాలాజ్‌ ఫౌండర్ ఆత్మహత్య.. 17 ఏళ్లకు వ్యాపారంలోకి ఎంట్రీ, ఇంట్లో ఎవరూ లేనప్పుడు

చాయ్‌వాలాజ్‌ ఫౌండర్ ఆత్మహత్య.. 17 ఏళ్లకు వ్యాపారంలోకి ఎంట్రీ, ఇంట్లో ఎవరూ లేనప్పుడు
Advertisement

Chaiwalaz: చాయ్‌వాలాజ్‌ వ్యవస్థాపకుడు రోహిత్ శర్మ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వయస్సు 30 ఏళ్లు. చిన్నవయస్సులో రోహిత్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించేటప్పటికి మరణించాడు. ఎందుకు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు? ఫ్యామిలీలో ఏమైనా సమస్యలున్నాయా?

చాయ్‌వాలాజ్‌ ఫౌండర్ ఆత్మహత్య

చాయ్‌వాలాజ్‌ అవుట్‌లెట్ల ఫౌండర్ రాజస్థాన్‌కు చెందిన రోహిత్‌ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దౌసాలోని తన నివాసంలో అతడు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబసభ్యులు బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. వారు ఇంటికి వచ్చేలోపు రోహిత్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తలుపు పగలగొట్టి అతడ్ని కిందకు దించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు వైద్యులు. ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Advertisement

పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. రోహిత్ తండ్రి హితేంద్ర మోహన్‌శర్మ మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. భార్య ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రోహిత్‌శర్మ నర్సింగ్ చదువుతున్నప్పుడు జైపూర్‌లో ‘చాయ్‌వాలాజ్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. అప్పుడు అతడి వయస్సు కేవలం 17 ఏళ్లు. ఆ విధంగా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడు. జైపూర్‌లోని మానసరోవర్ ప్రాంతంలో షిప్రా పాత్‌లో తన మొదటి టీ కేఫ్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఆ సిటీలో మరో అవుట్‌లెట్‌ను తెరిచాడు.

17 ఏళ్లకే వ్యాపారంలోకి అడుగులు

అలా వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తన వ్యాపారాన్ని ఏడు నగరాలకు విస్తరించాడు. వ్యాపారం జోరుగా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు. రోహిత్‌కు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. 6 నెలల క్రితం చాయ్‌వాలాజ్‌ షాపులను మూసి వేశాడు రోహిత్‌. ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టాడు. ఈ సమయంలో పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కనిపించాడు. ఓ వైపు వ్యాపారాన్ని సాగిస్తూ దౌసాలో సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.

Advertisement

ALSO READ: కాక్రోచ్ జనతా పార్టీ వేగంగా అడుగులు.. బుధవారం కీలక సమావేశం, అభిజీత్ మనసులోని మాట

Related News

వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

కాక్రోచ్ జనతా పార్టీ వేగంగా అడుగులు.. బుధవారం కీలక సమావేశం, అభిజీత్ మనసులో ఏముంది?

ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!

మైసూరులో విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కుర్‌కురే!

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!

జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు కుట్ర కలకలం!

Big Stories

Advertisement
×