E-Paper
Advertisement

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?
Advertisement

YSRCP: రెండేళ్లు ప్రశాంతంగా ఉన్న వైసీపీ నేతలు దూకుడు పెంచారా? వరుసగా నమోదవుతున్న కేసులు వెనుక ఏం జరుగుతోంది? నేతలపై కేసులతో ఆ పార్టీ నేతలు బెంబేలెత్తుతున్నారా? ఇంతకీ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విషయంలో ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు

కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు పోలీసులు. ఆయనతోపాటు 15 మందిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆలూరు కోర్టు అందరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షితోపాటు మిగతావారిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు. రాత్రి అక్కడే గడిపారు. సోమవారం వారి విడుదల కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. నెమకల్- సంగాల గ్రామాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు విషయంలో ఏం జరిగింది?

Advertisement

చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్-సంగాలకు చెందిన వైసీపీ కార్యకర్త గిరి ఫోన్‌లో వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య వివాదం కాస్త గాలివానగా మారింది. ఆ తర్వాత గొడవకు దారి తీసింది. ఈ విషయాన్ని వైసీపీకి చెందిన గిరి.. ఎమ్మెల్యే విరూపాక్షి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లడం వివాదం మరింత జఠిలమైంది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం, ఆపై రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త శేఖర్, నాగరాజు గాయాలయ్యాయి. పలువురు వైసీపీ కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు ఎడమచేతికి గాయాలు అయ్యాయి.

 

రాత్రంతా జైలులో ఎమ్మెల్యే
Advertisement

చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి ఎమ్మెల్యే విరుపాక్షితోపాటు పలువురు, టీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదు చేశాడు. మొత్తం 34 మందిపై కేసులు నమోదు అయ్యాయి. చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో జరిగిన చిన్నపాటి గొడవలు కాస్త వైసీపీ ఎమ్మెల్యే జైలుకి వెళ్లే పరిస్థితి నెలకొంది. జరుగుతున్న పరిణామాలను వైసీపీ హైకమాండ్ మింగుడుపడడం లేదు. మొన్న తమ్మినేని, ఇప్పుడు విరూపాక్షి వంటి నేతలపై కేసులు నమోదు కావడం ఆ పార్టీలోని నేతలకు మింగుడుపడడం లేదు. కవ్వించి కయ్యానికి వెళ్లేబదులు సైలెంట్‌గా ఉండడం బెటరనే వాదన అప్పుడే నేతల్లో వినిపిస్తోంది.

ALSO READ: జనసేన కీలక నిర్ణయం.. ప్రత్యర్థులకు ఇక కష్టాలే,  అసలు మేటరేంటి? 

 

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×