E-Paper
Advertisement

CM MK Stalin: డీలిమిటేషన్‌ వ్యవహారం.. కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం స్టాలిన్‌, రేపోమాపో సమావేశం

CM MK Stalin: డీలిమిటేషన్‌ వ్యవహారం..  కేంద్రాన్ని హెచ్చరించిన  సీఎం స్టాలిన్‌, రేపోమాపో సమావేశం
Advertisement

CM MK Stalin: దేశంలో ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం కేంద్రానికి కత్తి మీద సాముగా మారింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ కేంద్రాన్ని హెచ్చరించారు.

డీలిమిటేషన్‌పై కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం స్టాలిన్‌

Advertisement

డీలిమిటేషన్‌ వ్యవహారంపై కేంద్రాన్ని హెచ్చరించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై తాము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని వెల్లడించారు. బాధిత రాష్ట్రాలు ఏకమై ఈ వ్యవహారంపై చెన్నై వేదికగా సమావేశం నిర్వహిస్తామన్నారు. దీనిపై రాష్ట్రాలతో కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపలేదని పేర్కొన్నారు.

తమ హక్కులకు భంగం కలిగినా, దక్షిణాది రాష్ట్రాలపై ఏమాత్రమైనా ప్రభావం చూపినా భారీ ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈనెల 16 అనగా గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది మోదీ సర్కార్. అందులో నారీ శక్తి వందన అధినియమ్, డీలిమిటేషన్‌ బిల్లులపై చర్చ జరగనుంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వెల్లడించారు కూడా.

Advertisement

డీలిమిటేషన్‌పై మొదటి నుంచి తాము హెచ్చరిస్తున్నట్లు వెల్లడి

తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ డీలిమిటేషన్ విషయాన్ని తాము పక్కన పెట్టలేదన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న సందర్భంలో ఈ బిల్లు తేవడాన్ని కాంగ్రెస్ సైతం ప్రశ్నించింది. వీటిపై రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదింప చేయాలని చేస్తోందని ఆరోపించింది.

గతంలో కేంద్రం సూచించిన విధంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయని, ఇప్పుడు దానివల్ల పరిణామాలు ఎదుర్కొంటున్నామని స్టాలిన్ మాట. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, తమిళనాడులో కాకుండా దేశం అంతా ప్రభావితం అయ్యేలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక చోటు సమావేశమై సంయుక్త కార్యాచరణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ALSO READ: ఫస్ట్‌నైట్ రోజు ఎంత పని చేసింది.. భర్తకు షాకిచ్చిన భార్య.. శోభనం జరగాలంటే 90 లక్షలు డిమాండ్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. తమిళనాడు నుంచి మీకు ఇస్తున్న చివరి హెచ్చరిక అని, తమిళనాడు పోరాటం చేస్తుంది.. గెలుస్తుందన్నారు. మాకు రాష్ట్రాల హక్కులు ప్రాధాన్యతగా చెప్పారు. 1960 నాటి డీఎంకె స్ఫూర్తిని మరోసారి చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.

 

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×