E-Paper
Advertisement

కవితకు కేటీఆర్ పరోక్ష వార్నింగ్.. గులాబీ కోటలో రగులుతున్న రాజకీయం

కవితకు కేటీఆర్ పరోక్ష వార్నింగ్.. గులాబీ కోటలో రగులుతున్న రాజకీయం
Advertisement

KTR vs Kavitha:  తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ స్థాపించిన ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం.. పార్టీ పేరుని గులాబీబాస్ బీఆర్ఎస్‌గా మార్చడంతో ఇక టీఆర్ఎస్ చరిత్రకే పరిమితమవుతుందని భావించారు. అయితే టీఆర్ఎస్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ టైటిల్ దక్కించుకోవడానికి అన్నట్లు కేసీఆర్ బిడ్డలు కల్వకుంట్ల కవిత, కేటీఆర్‌లు పోటీ పడి స్టేట్‌మెంట్లు ఇస్తుండటంతో పాత పార్టీ పేరు మళ్లీ లైమ్‌లైట్‌లో ఫోకస్ అవుతోంది. మరిప్పుడు టీఆర్ఎస్‌పై పేటెంట్ ఎవరికి దక్కనుంది? కవితకు దక్కతుందా? కేటీఆర్ వశం చేసుకుంటారా? అన్న చర్చలు మొదలయ్యాయి.

2023 ఎన్నికల ముందు..

టీడీపీలో ఆశించిన మంత్రి పదవి దక్కలేదని బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడే ఎన్నికల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించుకుని, తర్వాత రాజీనామాలతో ఎప్పటికప్పుడు బైపోల్స్ జరిగేలా చూస్తూ నానా హడావుడి చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తన ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా ప్రకటించి.. తెలంగాణ సెంటిమెంట్‌తో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. 2023 ఎన్నికల ముందు అంటే 2022 అక్టోబర్‌లో టీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా అధికారిక గుర్తింపు పొందింది. దాంతో పార్టీ పేరులో తెలంగాణ లేకుండా పోయి, భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. మరి తెలంగాణ పేరుని పార్టీకి దూరం చేసిన ఫలితమో? లేకపోతే రెండు సార్లు అధికారంలో ఉండి చేసిన తప్పిదాలో కాని బీఆర్ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలు అలవాటుగా మారిపోయాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయి తన ఫాం హౌస్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.

కల్వకుంట్ల కవిత పెద్ద గండం..

Advertisement

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. సగానికి సగం ఎంపీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ జాతీయ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 39 స్థానాల్లో రెండు చోట్ల ఉపఎన్నిక అనివార్యమే అక్కడ కూడా ఓటమి మూటగట్టుకుంది. మిగిలిన ఎమ్మెల్యేల్లో పలువురు కారు దిగి హస్తం పార్టీ నీడకు చేరిపోయారు. అసలే వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలకు తోడు బీఆర్ఎస్‌‌కు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద గండంగా తయారయ్యారు. కొత్త పార్టీ పెట్టుకోవడానికి సన్నహాలు చేసుకుంటున్న కవిత నేరుగా బీఆర్ఎస్‌నే టార్గెట్ చేస్తూ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏప్రిల్ 3న మీడియా ముందుకొచ్చిన కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ శ్రేణుల్లో మరింత గుబులు మొదలైందంట. పాత పేరుతో కొత్త జెండాతో తమ పార్టీ రాబోతోందని సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉందని, ఆ పేరును ఎవరైనా వినియోగించుకోవచ్చని వ్యాఖ్యానించారు. కవితకు టీఆర్ఎస్ పేరు వాడుకుంటే ప్రజల్లో మంచి మైలేజ్ వస్తుందని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారంట. అందుకే కవిత ఆ విధంగా మాట్లాడారన్న ప్రచారం మొదలైంది.

బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కష్టాలు

మొత్తానికి కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయంట. దానిపై బీఆర్ఎస్ నేతల్లో పెద్ద చర్చే జరిగిందంట. టీఆర్ఎస్ పేరుతో కవిత బరిలోకి దిగితే తమకు ఇబ్బందులు తప్పవని, టీఆర్ఎస్ పేరుపై తమకే పేటెంట్ ఉంటుందని కొందరు నేతలు పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించారంట. టీఆర్ఎస్‌గా ఉన్నప్పుడు పార్టీకి అన్ని విధాలుగా బాగుందని, బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కష్టాలు రెట్టింపు అయ్యాయని గోడు వెల్లబోసుకున్నారంట. దానిపై బీఆర్ఎస్ హైకమాండ్ తీవ్రంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ విషయాన్ని కేసీఆర్‌తో చర్చించారని చెప్తున్నారు. ఇటు చూస్తే కవిత ఈ నెల 25ని తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని భావించి టీఆర్ఎస్‌ పేరుపై పేటెంట్ కోసం కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగేశారంట.

టీఆర్ఎస్ పేరుకు..

Advertisement

బీఆర్ఎస్‌‌‌‌ను టీఆర్ఎస్‌‌‌‌గా మార్చాలనే ప్రతిపాదన ఉందని, దానిపై పార్టీ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. పార్టీ పేరును మార్చడం వల్ల గత ఎన్నికల్లో నష్టపోయామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిదని, ప్రజల్లో గులాబీ జెండా బలంగా నాటుకుపోయిందని ఆయన చెప్పారు. ఆదివారం మంచిర్యాలలో పర్యటించిన కేటీఆర్.. నర్సపూర్​లోని పార్టీ జిల్లా ఆఫీసులో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరయ్యారు. అనంతరం క్యాతనపల్లిలోని బాల్క సుమన్ నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేశారు.

ప్రజా సమస్యలపై పాదయాత్ర

ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందని, కానీ.. స్పష్టమైన లక్ష్యంలేని పార్టీలకు మనుగడ ఉండదని కవిత పార్టీపై పరోక్షంగా స్పందించారు. తల్లిదండ్రులను బాధపెట్టే విధంగా పిల్లలు ప్రవర్తించరాదన్నారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమేనని, దీంతో ఎన్నికల్లో నష్టం జరిగిందన్నారు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మే, జూన్ లో పార్టీ సభ్యత్వం పూర్తిచేసి కమిటీలు వేస్తామని, 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ నేతలెవ్వరూ టీఆర్ఎస్ పేరు ఉచ్చరించిన పాపాన పోలేదు. బీఆర్ఎస్ పేరు పెట్టుకుని నష్టపోయామని వ్యాఖ్యానించే ధైర్యం ఎవరూ చేయలేదు. కవిత టీఆర్ఎస్ గురించి మాట్లాడాక కేటీఆర్ అదే పల్లవి ఎత్తుకోవడంతో.. బీఆర్ఎస్‌కు నిజంగానే చెమటలు పడుతున్నాయని జనం చర్చించుకుంటున్నారు. మరి టీఆర్ఎస్ ఎవరి సొంతం అవుతుంది అనేది ఉత్కంఠభరితంగా మారిందిప్పుడు.

Also Read: విష్ణుప్రియా అసలు స్వరూపం ఇదేనా.. ఐటి యాక్ట్ ఉచ్చులో బుల్లితెర బ్యూటీ!

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×