BigTV English

CM Siddaramaiah : కర్నాటక సీఎం‌కు హైకోర్టు షాక్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు కోర్టుకు రావాలని ఆదేశం..

Cm Siddaramaiah: కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య‌కు షాక్ ఇచ్చింది. సిద్దరామయ్యపై 2022లో ఓ కేసు నమోదు అయింది. అయితే సీఎం సిద్ధరామయ్య కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

CM Siddaramaiah : కర్నాటక సీఎం‌కు హైకోర్టు షాక్.. ఎంపీ, ఎమ్మెల్యేలకు కోర్టుకు రావాలని ఆదేశం..

CM Siddaramaiah : కర్ణాటక హైకోర్ట్ ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య‌కు షాక్ ఇచ్చింది. సిద్దరామయ్యపై 2022లో ఓ కేసు నమోదు అయింది. అయితే సీఎం సిద్ధరామయ్య తనపై నమోదు అయిన కేసు కొట్టివేయాలని అభ్యర్థిస్తూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ సిద్ధరామయ్యపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.


కేసును విచారించిన న్యాయస్థానం సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాతో, రామలింగారెడ్డి, మంత్రులు ఎంబీ పాటిల్‌ ఉన్నారు. మార్చి 6న ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకావాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

గతంలో కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా కేఎస్‌ ఈశ్వరప్ప పని చేశారు. అప్పట్లో తన సొంత గ్రామంలో జరిగిన పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆరోపించారు. తర్వాత ఆ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.


కర్నాటకలో అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో బసవరాజ్ బొమ్మై తన సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అందోళన చేపట్టింది. ఈ క్రమంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలోనే రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×