BigTV English

Chandrababu: ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే.. జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలి..

Chandrababu: పేదలు లేని రాష్ట్రాన్ని చూడాలని తన జీవిత ఆశయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu: ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే.. జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలి..

Chandrababu: ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బటన్‌ నొక్కితే సీఎం జగన్‌ మైండ్‌ బ్లాక్‌ అవ్వాలని టీడీనీ అధినేత చంద్రబాబు అన్నారు. రా.. కదలిరా.. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ను నమ్ముకుంటే జైలుకు పోతారన్నారు. వాలంటీర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కావాలనే అభద్రతా భావం సృష్టిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.


వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే తను వ్యతిరేకం కాదని చంద్రబాబు అన్నారు. కానీ, వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వాలంటీర్లకు రాజకీయాలొద్దు. మంచి పనులు చేసేవారికి మేం కూడా సహకరిస్తామన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన సంపద పేదలకు చేరాలనేది నా సంకల్పమన్నారు. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్‌ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు.

జగన్ అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. జనం రాతియుగం వైపు వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళ్లాలన్నారు. ఓడిపోతామని తెలిసి జగన్‌ మానసిక ఆందోళనలో ఉన్నారన్నారు. వైసీపీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.


ఏపీకి భవిష్యత్తులో కోతలు లేని విద్యుత్‌ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామన్నారు. జగన్‌ బ్రాండ్‌ పేరుతో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. జగన్‌కు మాత్రం ఇంకా ధనదాహం తీరలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు పెరగకుండా నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే ఏపీ 24 శాతం నిరుద్యోగంతో అగ్రస్థానంలో ఉందన్నారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×