E-Paper
Advertisement

మద్యం నిబంధనలు కఠినతరం.. విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐడీ కార్డు చూపిస్తేనే, ఆపై 21 ఏళ్లు

మద్యం నిబంధనలు కఠినతరం.. విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐడీ కార్డు చూపిస్తేనే, ఆపై 21 ఏళ్లు
Advertisement

Vijay Govt: సీఎం విజయ్ తమిళనాడులో మద్యం నియంత్రించే అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతను మద్యానికి దూరంగా ఉంచడమే వేగంగా అడుగులేస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు దగ్గరలో ఉన్న దాదాపు 717 మద్యం షాపులు క్లోజ్ అయ్యింది.

మద్యం నిబంధనలు కఠినతరం చేసిన విజయ్ ప్రభుత్వం

Advertisement

తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. మద్యం విక్రయాల సమయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. మద్యపాన వ్యసనాన్ని అరికట్టేందుకు 21 ఏళ్ల లోపు యువకులు మద్యం అమ్మకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పటివరకు 18 ఏళ్ల వయస్సు ఏజ్ లిమిట్‌గా ఉండేది. ఇక నుంచి ఆ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్-టాస్మాక్ రంగంలోకి దించారు. మద్యం అమ్మేవారు కచ్చితంగా తమ వయస్సు నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు తప్పనిసరి చేసింది.

Advertisement

మద్యం అమ్మేవారికి ఐడీ కార్డు తప్పనిసరి.. లేకుంటే ఓనర్ జైలుకే

ఒకవేళ వయస్సు నిర్ధారించే ఐడీ కార్డులు లేకున్నా, 21 ఏళ్ల లోపు వారు మద్యం విక్రయించే షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలుకు వెళ్లడం ఖాయం. ఈ విషయాన్ని టాస్మాక్ అధికారులు హెచ్చరించారు. అంతేకాదు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు మరొక విషయం కూడా ఉంది. వైన్ షాపులు, బార్లు, పబ్స్ దగ్గర కొత్తగా 21 ఏళ్ల యువకులు మద్యం అమ్మబడదు అనే బోర్డులు కచ్చితంగా ప్రదర్శించాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. తమిళనాడులో మద్యం అమ్మకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. బార్లు, పబ్స్, ప్రైవేట్ వ్యాపారులు వాటిని నిర్వహిస్తుంటారు.

ఇదిలాఉండగా మద్యం దుకాణాలు పని చేసే సమయాన్ని కుదించే విధంగా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. నేరాలు-ప్రమాదాలను తగ్గించేందుకు మద్యం షాపులను రాత్రి 8 గంటలకు మూసి వేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోందట విజయ్ సర్కార్.

ALSO READ: సామాన్యుడి జేబుకు చిల్లు పడింది.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ మాటేంటి?

అంతా అనుకున్నట్లుగా జరిగితే దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో విజయ్ వీటిపై హామీ ఇచ్చారు. డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలన చేస్తామని హామీ ఇచ్చారు. మద్యం నిర్మూలించే దిశగా అడుగులు వేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు.

విజయ్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×