E-Paper
Advertisement

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు
Advertisement

Priyanka Gandhi : ఎట్టకేలకు ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. కేరళలోని వయనాడ్‌ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు తన అన్న రాహుల్ గాంధీ వదిలేసిన స్థానంలో చెల్లెమ్మ పోటీ చేయనుండటంతో కేరళ రాజకీయాలు సైతం కీలక మలుపు తీసుకోనున్నాయి.

నెహ్రూ గాంధీ కుటుంబీకులు దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచే బరిలోకి దిగుతుండేది. నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు, రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు, తర్వాతి తరం రాహుల్ గాంధీ దాకా అంతా యూపీ ద్వారానే తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేవారు. కానీ తొలిసారిగా రాహుల్ కేరళను ఎంచుకున్నారు.

Advertisement

గతంలో మెదక్ పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు రాహుల్ పూర్తిగా దక్షిణ భారత్ వైపు మళ్లారు. అక్కడ్నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బలం పెంచేందుకు కృషి చేశారు.

అన్న స్థానం చెల్లెలికి… 

Advertisement

ఆ రాష్ట్రంలోని పాలక్కడ్‌, చెళక్కర (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలతో పాటు వయనాడ్ పార్లమెంట్’కు నవంబరు 13న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ రాజీనామాతో వయనాడ్‌ లోక్‌సభ స్థానం ఖాళీ అయిన వయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేయనున్నారు.

ఇక పాలక్కడ్‌ నుంచి రాహుల్‌ మామ్‌కుటథిల్‌, చెళక్కర (ఎస్సీ) నుంచి రమ్య హరిదాస్‌ల పేర్లను దిల్లీ అధిష్టానం ప్రకటించేసింది.

Also read : ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం షురూ… నోటిఫికేషన్ ఎప్పుడంటే ?

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×