BigTV English

Bhumika: కరీనా కపూర్ నా ఛాన్స్ లాగేసుకుంది.. భూమిక షాకింగ్ కామెంట్స్

Bhumika: కరీనా కపూర్ నా ఛాన్స్ లాగేసుకుంది.. భూమిక షాకింగ్ కామెంట్స్

Bhumika Chawla: అప్పటికీ, ఇప్పటికీ కొందరు హీరోయిన్స్‌లో అందం, గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటివారిలో భూమిక (Bhumika) ఒకరు. ఇప్పటికీ భూమిక అంటే చాలామందికి ఫేవరెట్. తను ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా.. హీరోయిన్‌గా నటించకపోయినా.. ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల మనసులో భూమికకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. సౌత్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా హిట్ సినిమాల్లో స్టార్ల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది భూమిక. తాజాగా తనకు బాలీవుడ్‌లో వచ్చిన ఆఫర్ గురించి చెప్పుకొచ్చింది. ఒక హిందీ హిట్ సినిమాలో తను నటించాల్సి ఉన్నా చివరి నిమిషంలో ఆ అవకాశం కరీనా కపూర్ చేతికి వెళ్లిపోయిందని బయటపెట్టింది.


బిజీ హీరోయిన్

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత హిందీలో కూడా భూమికకు అవకాశాలు రావడం మొదలయ్యింది. 2003లో ‘తేరే నామ్’ అనే సినిమాతో బీ టౌన్‌లో అడుగుపెట్టింది. మొదటి సినిమానే సల్మాన్ ఖాన్‌తో నటించే ఛాన్స్ రావడంతో చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. పైగా ఇందులో భూమిక పాత్రకు కూడా స్కోప్ ఉండడంతో చాలామంది బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. అలా సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా బిజీ అయిపోయింది. కొంతకాలం వరకు కనీసం ఏడాదికి అన్ని భాషలు కలిపి అరడజను సినిమాలు చేస్తూ బిజీగా గడిపేసింది. అదే సమయంలో ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది.


Also Read: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

చాలా మార్పులు

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జబ్ వీ మెట్’ చిత్రం 2007లో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అందులో షాహిద్ కపూర్, కరీనా కపూర్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో వర్కవుట్ అయ్యింది. ఇదొక క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. అయితే ముందుగా ‘జబ్ వీ మెట్’ సినిమాలో నటించే ఛాన్స్ భూమికకు వచ్చిందట. ఈ విషయం తానే స్వయంగా చెప్పింది. ‘‘జబ్ వీ మెట్ సినిమాను నేను సైన్ చేసినా కూడా అది జరగనప్పుడు నాకు చాలా బాధేసింది. నేను, బాబీ డియోల్ కలిసి ఈ సినిమా చేయాల్సింది. అప్పుడు దానికి ట్రైన్ అని టైటిల్ పెట్టారు. దాని తర్వాత షాహిద్ కపూర్, ఆయేషా టకియాతో ఆ సినిమా తీయాలనుకున్నారు. ఫైనల్‌గా షాహిద్, కరీనాతో సెట్ అయ్యింది’’ అని గుర్తుచేసుకుంది భూమిక.

అన్నీ మిస్

‘‘జబ్ వీ మెట్ సినిమా విషయంలో అదే జరిగింది కానీ పర్వాలేదు. నాకు ఒక్కసారే బాధ అనిపించింది. ఆ తర్వాత మళ్లీ దాని గురించి ఆలోచించలేదు. దాని గురించి పెద్దగా ఆలోచించను. మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్ సినిమా సైన్ చేశాను కానీ అది కూడా జరగలేదు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కన్నతిళ్ ముతమిట్టల్ కూడా జరగలేదు’’ అని ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకుంది భూమిక. ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’ విషయంలో తన తప్పేం లేదని దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ మరీ మరీ చెప్పాడని గుర్తుచేసుకుంది. సినీ పరిశ్రమలో జరిగే చాలా విషయాలు యాక్టర్ల కంట్రోల్‌లో ఉండవని చెప్పుకొచ్చింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×