E-Paper
Advertisement

Congress Record: 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రికార్డ్.. బీజేపీకి తగ్గిన ఓట్ షేర్

Congress  Record: 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రికార్డ్.. బీజేపీకి తగ్గిన ఓట్ షేర్
Advertisement

Congress Record in Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్ల ఓట్లను పొందింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గగా.. హస్తం పార్టీకి ఓట్ షేర్ భారీగా పెరిగింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 13. 63 కోట్ల ఓట్లను పొందింది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్టీఏకు మెజారిటీ సీట్లు దక్కడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుకు మరో సారి సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించింది. 1984 లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 12 కోట్ల ఓట్లను సాధించింది.

Advertisement

40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 12 కోట్లకు పైగా ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ అత్యధిక ఓట్లు సాధించగా. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా జరిగిన 2024 ఎన్నికల్లో 64.21 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అందులో కాంగ్రెస్ 13.63 కోట్ల ఓట్లను సాధించింది.

ఇదిలా ఉంటే.. గత ఎన్నికల తో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఈ సారి తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. కానీ 2019 ఎన్నికల కంటే బీజేపీ ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. అయినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కమలం పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 0.73 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ 1.76 శాతం ఓట్లను అధికంగా సాధించింది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×