BigTV English

Large Battery Electric Scooters & Bikes: అబ్బా కుమ్మేశారు.. భారీ బ్యాటరీతో అధిక మైలేజీ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు ఇవే!

Large Battery Electric Scooters & Bikes: అబ్బా కుమ్మేశారు.. భారీ బ్యాటరీతో అధిక మైలేజీ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు ఇవే!

Longest Range Electric Scooter and Bikes: ప్రస్తుతం దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్సే దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలపై బైక్ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చాలామంది మంచి మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈవీ స్కూటర్‌లు, బైక్‌లలో అధిక మైలేజీ ఇచ్చే వాహనాలేవో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల అలాంటి వారు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అధిక బ్యాటరీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను ఇక్కడ అందించా. ఇందులో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.


Ola S1 Pro, S1 X

ఈవీ మార్కెట్‌లో ఓలా కంపెనీ తనదైన హవా చూపిస్తోంది. కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేసి వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఈవీ ఇంతగా హైలైట్ కావడానికి అనేక కారణాలలో దాని మైలేజీ కూడా ఒకటి. ఇది 4kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా పెద్ద బ్యాటరీ. ఈ అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యం టాప్-స్పెక్ S1 Pro, ఎంట్రీ లెవెవల్ S1 X రెండింటిలో అందుబాటులో ఉంది. ఇవి వరుసగా.. 195కి.మీ, 190కి.మీ పరిధిని అందిస్తాయి. Ola S1 X ఇప్పుడు రూ.69,999 నుండి ప్రారంభమవుతుంది.


Tork Kratos R

Tork Kratos R అనేది 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన మరొక ఎంపిక. అయితే ఈ ప్యాక్ మోటార్‌సైకిల్ ఫారమ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉండే మెషీన్‌లో అమర్చబడింది. Kratos R మోటార్ సైకిల్‌కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 180కి.మీ పరిధిని అందిస్తుంది.

Also Read: హీరో నుంచి ‘జూమ్ కంబాట్ ఎడిషన్’ వచ్చేసింది.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..!

Oben Rorr

ఒబెన్ రోర్ కూడా 4.4kWh LFP బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. విభిన్న బ్యాటరీ కెమిస్ట్రీని కలిగి ఉన్న రోర్ మాత్రమే ఈ జాబితాలో ఉంది. ఈ ప్యాక్‌తో మీరు 187కి.మీ మైలేజీని పొందుతారు.

Simple Energy Simple One

సింపుల్ వన్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. ఇది 5kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇప్పటికీ ఈ కంపెనీ 525 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది స్థిరమైన, తొలగించగల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒకే ఛార్జ్‌తో సింపుల్ వన్ 212 కి.మీ పరిదిని అందిస్తుంది. Simple Energy Simple One రూ. 1.45 లక్షలతో ప్రారంభించబడింది.

TVS iQube ST

మొదటిసారిగా ఆవిష్కరించబడిన రెండు సంవత్సరాల తర్వాత.. TVS చివరకు రేంజ్-టాపింగ్ iQube ST 5.1 వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది అమ్మకానికి ఉన్న అత్యంత ఖరీదైన iQube. 5.1kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. ఒకే ఛార్జీతో 185కి.మీ పరిధిని కలిగి ఉంటుంది.

Ultraviolette F77 Mach 2

Also Read: స్ప్లెండర్ నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. కేవలం రూ.82,911లకే లాంచ్.. ఫీచర్లు మాత్రం బుర్రపాడు..!

Ultraviolette F77 Mach 2 ఎలక్ట్రిక్ బైక్‌ను స్టాండర్డ్, రీకాన్ అనే రెండు వేరియంట్‌లలో విక్రయిస్తుంది. స్టాండర్డ్ మ్యాక్ 2కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 211కి.మీల పరిధిని అందిస్తుంది. ఇది 7.1kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. Ultraviolette ఇటీవల F77 ఎలక్ట్రిక్ బైక్‌ను అప్‌డేట్ చేసింది.

Ultraviolette F77 Mach 2 Recon

భారతదేశంలో ద్విచక్ర వాహనంపై లభించే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ Ultraviolette F77 మాక్ 2 రీకాన్ వేరియంట్‌లో ఉంది. ఇది 10.3kWh సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 323కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×