E-Paper
Advertisement

Jayalalithaa’s Gold : జయలలిత ఆస్తుల కేసులో కీలక మలుపు.. కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు

Jayalalithaa’s Gold : జయలలిత ఆస్తుల కేసులో కీలక మలుపు.. కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు
Advertisement

Jayalalithaa’s Gold : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు చేసిన ఖర్చులకు తమిళనాడు ప్రభుత్వం.. కర్ణాటక సర్కారుకు రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఇక జయలలిత ఆభరణాలను వేలం వేయాలన్న పిటిషనర్లు.. జయలలిత మేనకోడలు, మేనల్లుడు జె.దీప, జె.దీపక్ దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. స్వాధీనం చేసుకున్న ఈ విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. ఆభరణాలను వేలం వేయడానికి బదులుగా తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం సబబేనని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబానికి హక్కు లేదని గతంలోనూ కోర్టు తేల్చిచెప్పింది.

Advertisement

.

.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×