BigTV English

Mount Fuji : వావ్.. మౌంట్ ఫ్యూజి!

Mount Fuji : వావ్.. మౌంట్ ఫ్యూజి!
Mount Fuji

Mount Fuji : మౌంట్ ఫ్యూజి.. జపాన్‌లో క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతం. ఆ దేశంలో పవిత్రమైన మూడు పర్వతాల్లో ఒకటి. 12,388 అడుగుల ఎత్తు ఉన్న ఈ అగ్నిపర్వతం విహంగ వీక్షణం ఎలా ఉంటుంది? పోదూ.. అదిరి పోదూ..? ట్రావెలర్ అయూమీ ఆ ముచ్చట తీర్చేశారు. జపాన్‌లోనే ఎత్తైన ఆ పర్వతాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో(
ᴀʏᴜᴍɪ – ᴛʀᴀᴠᴇʟᴇʀ – (@ooooooayumioooooo) on Instagram) షేర్ చేశారు.


ఐదు రోజుల క్రితం దానిని పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. ఏకంగా 1.8 మిలియన్ల వ్యూలు వచ్చాయి. 1.42 లక్షల మంది లైక్ కొట్టారు. ఫ్యూజి ఏరియల్ షాట్‌ను విమానం కిటికీ నుంచి తీశారు. ‘నింగి నుంచి మౌంట్ ఫ్యుజి..’ అనే కేప్షన్‌నూ జతచేశారు. ఫ్యూజి అగ్నిపర్వతాన్ని మంచు దట్టంగా కప్పేసింది.

పసిఫిక్ మహాసముద్ర తీరంలోని హొన్షు దీవిలో ఉందీ అగ్నిపర్వతం. జపాన్ రాజధాని టోక్యో నుంచి దూరం 100 కిలోమీటర్లు. ఫ్యూజిశాన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ జనసాంద్రత అధికం. ప్రపంచ వారసత్వ సంపద హోదాను ఫ్యూజి దక్కించుకుంది. ఈ యునెస్కో సైట్‌ను ఏటా లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. దీనిని అధిరోహించేందుకు కూడా అమితాసక్తి చూపుతుంటారు.


ప్రతి వేసవిలోనూ 3 వేల మంది వరకు పర్వతారోహకులు ఫ్యూజిని ఎక్కుతారు. జూన్, జూలై నెలల్లో మౌంట్ ఫ్యూజిని సందర్శించేందుకు బెస్ట్ టైం. ఇన్‌స్టాలో దీని ఏరియల్ షాట్ చూసి యూజర్లు ఎంతో ముగ్ధులయ్యారు. ఎంతో అందమైన దృశ్యం అని ఒకరు స్పందిస్తే.. ‘మిలియన్ డాలర్ వ్యూ’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×