E-Paper
Advertisement

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. డాక్టర్ ఉమర్ చివరి వీడియో, సూసైడ్ బాంబర్ల గురించి ఏం చెప్పాడంటే?

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. డాక్టర్ ఉమర్ చివరి వీడియో, సూసైడ్ బాంబర్ల గురించి ఏం చెప్పాడంటే?
Advertisement

Delhi Blast Dr Umar Last Video: ఢిల్లీ పేలుళ్లలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ చివరి వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో అతడు ఆత్మాహుతి బాంబు దాడుల గురించి తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆత్మాహతి దాడిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.

ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. డాక్టర్ ఉమర్ చివరి వీడియో

Advertisement

ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని పేలుడు కేసులో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ చివరి వీడియో బయటకు వచ్చింది. అందులో ఆత్మాహుతి బాంబు దాడి, అంతిమ లక్ష్యం గురించి  చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడుకు కొన్నిరోజుల ముందు అది రికార్డ్ చేయబడిందని సమాచారం. ఈ వీడియో ద్వారా డాక్టర్ ఉమర్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుస్తోందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.

ఆత్మాహుతి దాడులను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్‌గా వర్ణించాడు డాక్టర్ ఉమర్. యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా వ్యాఖ్యలు చేశాడు ఉమర్. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలురకాల ఆలోచనలు ఉన్నాయని అన్నాడు. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందన్నాడు.

Advertisement

ఆత్మాహతి దాడుల గురించి ఉమర్ మాటలు

చావు ఫైనల్ అని నిర్ణయించుకోవాలని తెలిపాడు. నిజానికి అలాంటి ఆలోచనలను ఈ సమాజం అంగీకరించదన్నాడు. నిజానికి ఇది అమరులయ్యే ఆపరేషన్ అని అన్నాడు. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదన్నాడు. దాడికి ఈ వీడియో కీలకంగా మారినట్టు దర్యాప్తు టీమ్స్ భావిస్తున్నాయి.

డాక్టర్ ఉమర్ ఎందుకు ఆత్మాహుతి దాడి  చేసుకోవాల్సి వచ్చింది? అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. వైద్య వృత్తిని అభ్యసించిన ఉమర్, మనుషుల ప్రాణాలు కాపాడాల్సిపోయి, చివరకు ప్రాణాలు తీసిన సూసైడ్ బాంబర్‌గా మారిపోయాడు. ఇస్లాంలో ఆత్మహత్య నిషిద్ధం, ఉమర్ మాత్రం ఆత్మాహుతి బాంబుదాడిని బలిదానంగా సమర్థించుకుంటున్నాడు.

ఉమర్ ఇంగ్లీష్ యాసలో మాట్లాడాడు. ఢిల్లీ కారు పేలుడును జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టు ఈ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. తొలుత పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నప్పుడు అనుకోకుండా పేలుడు జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావించాయి.  దీంతో ఢిల్లీ పేలుడు వెనుక అసలు కుట్ర బయటపడి నట్లైంది.

జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు వైద్యులు, ఉన్నత విద్యావంతులైన నిపుణులను నియమించుకుంటున్నాయని చెప్పవచ్చు. నవంబర్ నెల ప్రారంభంలో ఫరీదాబాద్ నుండి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న కొద్దిసేపటికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు జైషే మొహమ్మద్-అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ లతో సంబంధం ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద మాడ్యూల్‌ను నిఘా వర్గాలు ఛేదించాయి.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×