E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ సర్ప్రైజ్..కన్నీళ్లు పెట్టుకున్న తనూజ..

Bigg Boss 9 Telugu : ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ సర్ప్రైజ్..కన్నీళ్లు పెట్టుకున్న తనూజ..

Bigg Boss 9 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 10 వారాలు పూర్తిచేసుకుని 11 వ వారంలోకి అడుగు పెట్టింది.. పదోవారం నిఖిల్ గౌరవ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అందరూ కూడా నామినేషన్స్ లోకి రావడంతో ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటికి వచ్చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.. నిజానికి మరికొన్ని వారాల్లో ఈ షో ముగియనుంది. ఈ క్రమంలో హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారు విన్నర్ ఎవరో అవుతారు అని జనాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఇది పక్కన పెడితే ప్రతి సీజన్లో కంటెస్టెంట్లకు ఫ్యామిలీ వీక్ అనేది ఉంటుంది.. అలాగే ఈ సీజన్లో కూడా ఈ వారం ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ జరగనుంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్ వల్ల కుటుంబ సభ్యులు హౌస్ లోకి రానున్నారు. ముందుగా బిగ్ బాస్ తనూజకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఫ్యామిలీ వీక్ లో తనూజకు బిగ్ సర్ప్రైజ్.. 

ప్రతి ఏడాది ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్ లోకి వస్తున్నారు. అప్పుడు వాళ్లని చూసిన కంటెస్టెంట్లు ఎమోషనల్ అవుతూ ఉంటారు.. ఈ ఎపిసోడ్  సీజన్ కి హైలెట్ గా నిలుస్తాయి.. కుటుంబ సభ్యులను ఒక్కసారిగా చూసిన కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకోవడం, వారితో సరదాగా గడుపుతారు. అలాగే ఈ సీజన్లో కూడా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో తనుజాకు బిగ్ బాస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. తనూజకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తనూజ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్నారిని చూసి తనూజా సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత పాపను హౌస్ లోకి తీసికెళ్లి అందరికి పరిచయం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. మొత్తానికి ఈ వారం హౌస్మెట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి రాబోతున్నారని తెలుస్తుంది. ఏ కంటెంట్ కోసం ఎవరు వస్తారు అన్నది తెలియాలంటే కచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ ని చూడాల్సిందే..

Also Read :ఐబొమ్మ రవి స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. అడుగడుగునా అవమానాలు.. విలన్ ఆమె..?

11 వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే.. 

పదోవారం నామినేషన్స్ జనాలను కన్ఫ్యూజన్లో పడేసాయి.. ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం బిగ్ షాక్ ఇచ్చాడు. ఒకేసారి ఇద్దరినీ బయటికి పంపించారు.. దాంతో ఈవారం కూడా మరో ఇద్దరూ హౌస్ని వీడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 11 వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే.. పదకొండో వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇమ్మానుయేల్, భరణి, రీతూ,సంజన, పవన్, దివ్య సుమన్ శెట్టి ఉన్నారు. ఈసారి రీతు, సంజన, దివ్య ముగ్గురిలో ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండడంతో ఈవారం కూడా డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ సమాచారం.. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.. ఇక ఇప్పటికే విన్నర్ తనుజ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×