E-Paper
Advertisement

దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు.. దిల్లీ, ముంబయిలో పేలుళ్లకు కుట్ర.. 9 మంది అరెస్టు

దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు.. దిల్లీ, ముంబయిలో పేలుళ్లకు కుట్ర.. 9 మంది అరెస్టు
Advertisement

Delhi Arrest: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన 9 మందిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ, ముంబయిలో వారు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో దిల్లీ, ముంబయి, పంజాబ్ లకు చెందినవారితో పాటు కొందరు విదేశీయులు సైతం ఉన్నట్లు దిల్లీ స్పెషల్ పోలీసు సెల్ వెల్లడించింది. వారి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

నిందితులు టార్గెట్ చేసిన జాబితాలో అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ‘నిందితులు పాక్ ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్ సహాయంతో భారత్‌లోకి నిధులు, పేలుడు పదార్థాలను చేరవేసేందుకు వీరు ప్రయత్నించారు’ అని దిల్లీ స్పెషల్ సెల్ కు చెందిన ఉన్నతస్థాయి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

దేశ రాజధాని దిల్లీకి ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందంటూ కొద్ది రోజుల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆత్మాహుతి దాడులు, వాహనాల ముసుగులో ఐఈడీ పేలుళ్లు, కాల్పులు వంటి జరగొచ్చని సూచించాయి. దిల్లీలోని ప్రముఖ ఆఫీసులు, రద్దీ ప్రాంతాలను ముష్కరులు లక్ష్యంగా చేసుకోవచ్చని ఈ నెల ప్రారంభంలో హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి భద్రతా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పారా మిలటరీ బలగాలతో పహారాను మరింత పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలోనే పాక్ తో సంబంధాలు ఉన్న 9 మందిని తాజాగా భద్రతా బలగాలు అరెస్ట్ చేయడం గమనార్హం.

Also Read: ఒడిశాలో ఘోర ప్రమాదం.. కారును 600 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో వైరల్!

Advertisement

ఇదిలా ఉంటే గతేడాది నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇటీవలే మే 14న ఎన్ఐఏ అధికారులు తొలి ఛార్జ్ షీటును ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. 7,500 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జ్​ షీట్ లో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్​ బిన్ నబీతోపాటు మొత్తం 11మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్​ అహమద్ మొహియుద్దీన్​ సయ్యద్ కూడా ఉన్నాడు. దర్యాప్తులో భాగంగా 588మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. 395కు పైగా డాక్యుమెంట్లు, 200కు పైగా సీజ్​ చేసిన పరికరాల నుంచి సాక్ష్యాలను సేకరించారు.

Also Read: గుంపు మేస్త్రీపై పోరాటానికి.. ప్రజలు సిద్ధం కావాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×