BigTV English

Yamuna Drowned: యమునలో ముగ్గురి మునక.. ఒకరు గల్లంతు

Yamuna Drowned: యమునలో ముగ్గురి మునక.. ఒకరు గల్లంతు
Three teenagers drown in Yamuna in Delhi one missing

Three teenagers drown in Yamuna in Delhi one missing: టెన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురు ఢిల్లీలోని బురారీ వద్ద యమునా నదిలో మునిగిపోయారు. మరొకరు గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 15-17 ఏళ్ల వయసున్న స్నేహితులు నలుగురు యమునలో స్నానం చేసేందుకు వెళ్లారు. తమ పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అన్ని దిక్కులా గాలించారు.


యమునా నది తీరంలో వారి దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారితో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రెస్క్యూబోట్‌తో ఓ బృందం నదిలో గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగో విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు కొనసాగుతోంది. గత జూలై 22న ఇదే ప్రాంతంలో నలుగురు యమునా నదిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు.


Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×