BigTV English

India Vs England 4th Test: ఆ నలుగురిలో ఉండేదెవరు..? కూర్చునేదెవరు..?

India Vs England 4th Test: ఆ నలుగురిలో ఉండేదెవరు..? కూర్చునేదెవరు..?
cricket news today

India Vs England 4th Test Match Updates: టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో కొత్త పాత కలయికలతో విజయం సాధిస్తోంది. ఆడేవాళ్లు ఆడుతున్నారు. పోరాడేవాళ్లు పోరాడుతున్నారు. శ్రేయాస్ లా వెళ్లిపోయేవాళ్లు వెళ్లిపోతున్నారు. ఇది ఒకవైపు ఇలా నడుస్తుంటే టీమ్ ఇండియాను గాయాల బెడద పట్టి పీడిస్తోంది.


రెండో టెస్ట్ మ్యాచ్‌లో, రెస్ట్ తీసుకుని మళ్లీ వచ్చిన వారిలో రవీంద్ర జడేజా ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా రెండు టెస్టులు రెస్ట్ తీసుకున్నాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కి కూడా వచ్చేది అనుమానంగా మారింది. ఇంకోవైపు బుమ్రా, యశస్విలాంటివారికి టీమ్ మేనేజ్మంట్ విశ్రాంతినిస్తోంది. ఇలా కొత్తవారిని ప్రయోగిస్తోంది.

Read More: అకాయ్’ జపాన్ వారి పేరులా ఉందే..! నెటిజన్ల ఆరా..


ఇలా సీనియర్ల గైర్హాజరీలో టీమ్ ఇండియాకు మంచే జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆణిముత్యం దొరికింది. లేకపోతే కళ్లుండి గుడ్డి వారిలా మరో కొన్నేళ్లయినా తను అలాగే దేశివాళీ ఆటలు ఆడుకుంటూ కాలం గడిపేవాడు. మూడేళ్ల నుంచి వెయిటింగ్‌లో ఉన్నాడు. ఇలా ఎంతమంది సర్ఫరాజ్ లాంటి ఆటగాళ్లు ప్రపంచానికి తెలియకుండా కనుమరుగై పోతున్నారో ఎవరికీ తెలియడం లేదు.

నలుగురు ఆరంగేట్రం ఆటగాళ్లు ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చారు. రజత్ పటీదార్ ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాడు. తను ప్రూవ్ చేసుకోవాలి. ధృవ్ జురెల్ భారత్ ఆశాకిరణంలాగే కనిపిస్తున్నాడు. కీపింగ్‌లో అద్భుతమైన డైవింగ్‌లు చేస్తున్నాడు. చాలా చురుగ్గా కదులుతున్నాడు. మెరికలాంటి కీపర్‌లా మారిపోయాడు.

కీపింగ్ సమస్య ఒకటి తీరింది. సర్ఫరాజ్ రూపంలో బ్యాటర్ దొరికాడు. అక్కడ బెస్ట్ ఫినిషర్‌గా రూపాంతరం చెందనున్నాడు. కొత్తగా నాలుగో టెస్ట్‌లో మరి దేవదత్ పడిక్కల్‌కి అవకాశం దక్కుతుందా? లేదా? అని చూడాలి. మరి తనలో ఎంతటి గొప్ప ఆటగాడు దాగున్నాడో తెలీదు.

అద్రష్టానికి అడుగు దూరంలో ఉన్న తనకి బీసీసీఐ తలుపు తీస్తుందా? అక్కడే ఆపేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ నలుగురిలో జాతీయ జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేవారెవరు? అనేది.. మరో రెండు టెస్టులు ముగిసేలోపు తెలిసిపోతుందని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×