BigTV English

Apple Macbook Air M1: ఆపిల్ లాప్‌టాప్‌పై ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. డోంట్ మిస్!

Apple Macbook Air M1: ఆపిల్ లాప్‌టాప్‌పై ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. డోంట్ మిస్!

Rs 22,000 Discount on Apple Macbook Air M1: యాపిల్ కంపెనీకి మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంది. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్, ఇయర్ బడ్స్, ల్యాప్‌టాప్స్ ఇలా చాలా వాటికి మంచి క్రేజ్ ఉంది. వినియోగదారులు ఎక్కువగా ఈ కంపెనీకి చెందిన వస్తువులనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధర ఎంత ఎక్కువ ఉన్నా.. ఎగబడి కొనేస్తున్నారు.


కానీ, మరికొందరు మాత్రం అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. అలాంటి వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్.

ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో యాపిల్ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ కంపెనీకి చెందిన MacBook Air M1 (Apple 2020 Macbook Air Apple M1) ల్యాప్‌టాప్‌ను భారీ తగ్గింపుతో ఇంటికి తీసుకెళ్లొచ్చు. అవునండీ మీరు విన్నది నిజమే.. ఈ ల్యాప్‌టాప్‌పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సూపర్ డూపర్ డిస్కౌంట్ అందిస్తోంది.


READ MORE: ఈ ల్యాప్‌టాప్ రూ.14 వేలే.. 100GB క్లౌడ్ స్టోరేజీతో పాటు అద్భుతమైన ఫీచర్లు..!

యాపిల్ 2020 మాక్‌బుక్ ఎయిర్ ఎం1 ల్యాప్‌టాప్ 256GB వేరియంట్ ధర లాంఛ్ సమయంలో రూ.99,900గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఈ ల్యాప్‌టాప్‌పై 21 శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే రూ.21,910 తగ్గింపుతో ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.77990కే సొంతం చేసుకోవచ్చు.

కాగా ఈ ల్యాప్‌టాప్ ఇప్పటికీ యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో లాంచ్ సమయంలో ఉన్న ధరకు అందుబాటులో ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే దీనిపై ఆఫర్ ఉంది. ఇకపోతే ఈ ల్యాప్‌టాప్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌ ద్వారా రూ.33,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు.

READ MORE: ఈ ఫోన్ కొన్నవారికి మనీ వాపస్.. కారణం ఇదే..?

ఈ ల్యాప్‌టాప్ 13.3 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇది స్టైలిష్‌, పోర్టబుల్‌గా ఉండటంతో పాటు తక్కువ బరువు కలిగి ఉండటంతో ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు ప్రత్యేకంగా నచ్చింది.

Tags

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×