BigTV English

Ayodhya Darshan : తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం.. ఆలయంలో తోపులాట..

Ayodhya Darshan : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదటి రోజు కేవలం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన అతిథులకు మాత్రమే దర్శనం కల్పించారు. ఇక నేటి నుంచి సాధారణ భక్తులను దర్శనంకి అనుమతించనున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దర్శనాలు ప్రారంమైన తొలిరోజు నుంచే అయోధ్యకు భక్తులు భారీగా పోటేత్తారు. దీంతో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కువ మంది ఒకేసారి దర్శనానికి రావడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Ayodhya Darshan : తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం.. ఆలయంలో తోపులాట..
Ayodhya ram mandir news

Ayodhya ram mandir news(Telugu flash news):

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదటి రోజు కేవలం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన అతిథులకు మాత్రమే దర్శనం కల్పించారు. ఇక నేటి నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దర్శనాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే అయోధ్యకు భక్తులు భారీగా పోటేత్తారు. దీంతో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కువ మంది ఒకేసారి దర్శనానికి రావడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.


అయోధ్యలో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ శ్రీరాముడి దివ్య దర్శనం కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ పరిసరాల్లో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. కాగా ఉదయం 7 గంటలకు దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద రద్దీ ఏర్పడింది. ఆలయంలో ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుందని భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు భక్తులకు విజ్ఞప్తి చేశాయి.

అయోధ్యకు వచ్చే భక్తులకు రోజులో రెండు సమయాల్లో బాలరాముడి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు తొలి దశ దర్శనం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతామని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కాగా.. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నందున దర్శన సమయాలను పెంచాలని ఆలయ ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు.


Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×