E-Paper
Advertisement

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!

Delhi : ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఆ మహిళే టార్గెట్..!
Advertisement

Delhi : దేశంలో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవల యూపీలో గ్యాంగ్ స్టర్ , మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదురుడిని పోలీసుల సమక్షంలోనే ముగ్గురు యువకులు కాల్చి చంపారు. తాజాగా ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.

లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు ఓ మహిళను టార్గెట్ చేశాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Advertisement

సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద కాల్పులు ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ కోసం ఆ మహిళ కోర్టుకు హాజరయ్యారు. ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ లాయర్‌ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు.. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి న్యాయవాదిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సాకేత్‌ కోర్టు ఆవరణలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ మధ్యకాలంలో కాల్పుల ఘటనలు పెరగడంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×