Road Accident: తిరుమల దర్శనం తర్వాత బెంగుళూరు వెళ్తున్న రెండు కుటుంబాల యాత్ర విషాదంగా ముగిసింది. ఓ ఇన్నోవా కారు రాతి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో తీవ్రంగా ముగ్గురు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెళ్లిన రెండు కుటుంబాల యాత్ర విషాదంగా ముగిసింది. బెంగళూరు-మైసూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల కుటుంబాలు సోమవారం తెల్లవారుజామున తిరుమల దర్శనానికి బయలుదేరారు. దర్శనం తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని దొడ్డకరి గ్రామం సమీపంలోఇన్నోవా కారు రాతి కల్వర్టును ఢీ కొట్టింది.
ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మైసూరు ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల దేవేంద్ర, అతడి అత్త 70 ఏళ్ల శారదాబాయి, పిల్లలు 20 ఏళ్ల దీక్ష, 12 ఏళ్ల విష్ణు సాయిగా గుర్తించారు పోలీసులు. గాయపడిన బాధితులు వికాస్, నీతూ, ఆద్వికలకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇన్నోవా డ్రైవర్ వికాస్‌రావు వాహనం నడుపుతూ కునుకు తీయడం వల్ల ఈ ఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీ కొట్టినట్టు తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం నిటారుగా ఉండే రోడ్డు కావడంతో కారు ఎడమవైపుకు దూసుకెళ్లి డివైడర్‌ని ఢీ కొట్టి పక్కన ఉన్న పొలంలోకి దూసుకు పోయిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం బెతమంగళ పోలీసుల అధికార పరిధిలో ఉండడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2025 మార్చిలో బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే మీద రాకపోకలు ప్రారంభమయ్యాయి. అది తెరిచిన నుంచి ఇప్పటివరకు ఆ జాతీయ రహదారిపై డజనుకు పైగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో దాదాపు 25 మంది మరణించారు.
ALSO READ: విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్