E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి నిజం చెప్తుందా..? పార్వతి చనిపోతుందా..? పాపం అక్షయ్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 8th : పార్వతి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏదైనా అయదా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పార్వతి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏదైనా అయిందా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. తన తల్లికి నిజం తెలిస్తే తట్టుకోలేదు తండ్రిని కోల్పోయిన మాకు తల్లి కూడా మిగలదు అని అందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. పార్వతి ఆ మాట అడగగానే కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి కాళ్లు పట్టుకుంటాడు. ఏమైంది కమల్ ఎందుకు అలా అన్నావ్ ఏం జరిగింది? మీ నాన్నని తీసుకొని వస్తారని వెళ్లారు కదా మరి అందరూ ఊరికే వచ్చారు ఎక్కడ మీ నాన్న ఎప్పుడు వస్తాడు ఇవాళ వస్తాడా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే భానుమతికి కూడా అనుమానం రావడంతో కమల్ నిజం చెప్పబోతాడు. కానీ అవని కమల్ని కంట్రోల్ చేసే లోపల పంపిస్తుంది.. పల్లవి మాత్రం ఈ నిజాన్ని ఎలాగైనా తన అత్తయ్యకి చెప్పి ఇంట్లో వాళ్లకి పార్వతిని కూడా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.

పాపం కమల్..

కన్నతండ్రి చనిపోయాడు అని అందరూ బాధపడిపోతూ ఉంటారు. అవని ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించినా కూడా అందరూ బాధపడుతూనే ఉంటారు. అక్షయ్ ఈ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా.. కమల్ నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య నాన్న చనిపోయాడు అన్న బాధని అమ్మతో చెప్పలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మనము నాన్నకి చనిపోయాడు అని అమ్మకెందుకు చెప్పలేకపోతున్నాము తప్పు చేస్తున్నావేమో అన్నయ్య అని కమల్ అంటాడు. ఇప్పుడు చెప్పకపోవడం తప్పే కన్నయ్య కానీ అత్తయ్య పరిస్థితి ఏంటో తెలుసు కదా ఇలాంటి అప్పుడు మనం ఆవిడ గురించి చెప్తే బాగోదు కదా అని అవని అంటుంది.. ఆవిడ పరిస్థితి బాగేనప్పుడు మనం ఆమెకు ఈ విషయం చెప్తే బాగుంటుంది. ఇప్పుడే చెప్పే ఆమె పరిస్థితి ఎలా పోతుందో చెప్పలేం కదా..అందుకే వద్దు అని అన్నాను అని అవని అంటుంది.

కర్మ చేయించాలి..

Advertisement

ఈ సెంటిమెంట్ సీన్లో నేను లేకపోతే అస్సలు బాగోదు కదా.. నేను కూడా ఆ సెంటిమెంట్లో భాగం పంచుకోవాలని లేదంటే నా మీద అనుమానం వస్తుంది అని పల్లవి అనుకుంటుంది. ఇక పల్లవి అక్కడికి వెళ్లి అత్తయ్యకు నిజం చెప్పకపోవడం తప్పే కానీ అత్తయ్య పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అని తనకు నచ్చిన విధంగా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే కమల్ నేను చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను అమ్మ పరిస్థితిని చూసి నవ్వుతూ ఉండలేకపోతున్నాను అని కమల్ బాధపడతాడు. వెంటనే కర్మ చేయించడానికి పంతులు గారికి ఫోన్ చేసి అవ్వని రమ్మని చెప్పింది. ఈ విషయాన్ని అత్తయ్యకి తెలియకుండా చేయాలి అని అంటుంది దానికి పల్లవి నువ్వేం చేస్తే అదే కరెక్ట్ అక్క అని అంటుంది.

పల్లవి మాటతో షాక్..

ప్రణతి బాధ పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. కోల్పోయిన విషయం కన్నతల్లికి చెప్పకుండా.. తనలో తానే ఇలా ఓదార్చుకో లేకుండా ఉండడం నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది.. భరత్ మీనాక్షి మీ భార్యని ఓదార్చాల్సిన అవసరం నీకుంది. తనకి ధైర్యం చెప్పు అని చెప్తూ ఉండగా.. పల్లవి లోపలికి వచ్చి ఇలాంటి ధైర్యం నాకు చెప్పేవాళ్ళు లేరు నా భర్తకి చెప్పి నా దగ్గరికి పంపించిన వాళ్లు లేరు మా అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను అని పల్లవి అంటుంది. పల్లవి మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రణతి మా నాన్న చనిపోతే ఇలా ఎలా మాట్లాడుతున్నావ్ వదినా అని అంటుంది ఇక పల్లవి చెప్పిన మాట విని అందరు కూడా మౌనంగా ఉండిపోతారు.

అక్షయ్ కన్నీళ్లు.. అవని ఫీల్..

Advertisement

అక్షయ్ తన తండ్రి చనిపోయాడు అని గదిలో కూర్చొని బాధ పడిపోతూ ఉంటాడు.. తన తండ్రి తో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన అవనిని చూసి మా నాన్న బ్రతకాలని ఎంతోమంది కోరుకున్నారో.. ఒక మంచి మనిషి చనిపోతే ఎంతోమంది తను బ్రతకాలి అని అనుకున్నారు తన గురించి ఎంతమంది బాగుపడిపోతున్నారో మనం చూసుకునే ఉన్నాం కదా అంటూ తన తండ్రి చేసిన గొప్పతనం గురించి చెప్తూ బాధపడిపోతూ ఉంటాడు. అసలు మావయ్య గారు చాలా గొప్పవారు. మావయ్య గారికి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి మనం చేయాలి.. ఎలాగైనా సరే అత్తయ్య గారికి తెలియకుండా ఈ పనులను చేయాలి అని అనుకుంటుంది. మావయ్య గారు లేరన్న విషయాన్ని తట్టుకోవడం నావల్ల కావడం లేదండి ఆయన కూడా అత్తయ్య గారి కోసం ఆ బాధని నాలో నేనే దిగమింగుకుంటున్నాను అని అవని చాలా బాధపడిపోతుంది.. అమ్మకి చెప్పకుండా ఇదంతా చేయడం అవని అని అక్షయ్. కానీ అవని మాత్రం మీరే ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా బాధపడిపోతూ ఉంటే ఏంటండీ వాళ్ళందరికీ ధైర్యం ఎవరు చెప్తారు అని అవని అనగానే నావల్ల కావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

పార్వతికి అనుమానం..

పార్వతి అలాగే ఆరాధ్య ఇద్దరు కలిసి తాతయ్యకి తొందరగా బాగవాలి అని దేవుడి దగ్గర దండం పెట్టుకుందాం పదనానమ్మ అని దేవుడు గదిలోకి వెళ్తారు.. అక్కడ పూజ గదిలో దండం పెట్టుకున్న తర్వాత బొట్టు పెట్టుకునే సమయానికి కుంకుమ కింద పడిపోవడంతో తనకి ఏదో అనుమానం కలుగుతుంది అని అనుకుంటుంది. కానీ పార్వతి చేయి జారిపోయింది లేకపోతే ఇంకా ఏదైనా సమస్యల్లో జరుగుతున్నాయా అని ఆలోచనలో పడుతుంది. పల్లవి మాత్రం ఎలాగైనా సరే పార్వతికి నిజం చెప్పాలి అని అనుకుంటుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందన్నది సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో పల్లవి నిజం చెప్తుందా లేదా అన్నది చూడాలి..

Also Read :మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Related News

Podarillu Today Episode : జయంతి మాటతో షాక్.. చక్రీకి చుక్కలు చూపించిన మహా.. మనీషాకు షాక్.

Ninnu kori Serial Today Episode September 8th‘నిన్నుకోరి’ సీరియల్‌: విరాట్ కు యాక్సిడెంట్ – అయమయంలో చంద్ర

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి భద్ర వార్నింగ్.. భాగ్యం ప్లాన్ సక్సెస్.. మళ్లీ తప్పించుకున్న శ్రీవల్లి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!

Big Stories

Advertisement
×