Tanveer Ahmed On BCCI: పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) మరోసారి రెచ్చిపోయి కామెంట్స్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తో పాటు బీసీసీఐని (BCCI) కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ క్రికెటర్లతో బీసీసీఐ చాకిరీ చేయించుకుంటుందని.. డబ్బులు ఎగజల్లి వాళ్లతో ఆడుకుంటూ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తమ స్వార్థం కోసం.. ఇంగ్లాండ్ తో ( England) పాటు ఆస్ట్రేలియా ( Australia) ప్లేయర్స్ ను ఐపీఎల్ మాత్రమే ఆడేలా కుట్రలకు తెరలేపుతున్నట్లు బాంబు పేల్చారు. అదే సమయంలో తమ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో విదేశీ క్రికెటర్లు పాల్గొనకుండా కుట్రలకు తెర లేపుతున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో బీసీసీఐ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ప్రపంచంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐ (BCCI)… క్రికెట్ వ్యవస్థను శాసిస్తోందని తన్వీర్ అహ్మద్ విమర్శలు చేశారు. ఐపీఎల్ కోసం భారీగా డబ్బులు ఆఫర్ చేసి… విదేశీ క్రికెటర్లను తమ వైపునకు లాగేసుకుంటుందని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి చిన్న టోర్నమెంట్ లను దెబ్బ కొడుతోందని ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాల క్రికెటర్లు కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడేలా బిసిసిఐ కండిషన్స్ పెడుతోందని షాకింగ్ ఆరోపణలు చేశారు. తద్వారా పాకిస్తాన్ సూపర్ లీగ్ లేదా ఇతర లీగ్స్ లలో వాళ్లు పాల్గొనకుండా బీసీసీఐ రాజకీయాలకు తెర లేపుతున్నట్లు మండిపడ్డారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లపై కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు తన్వీర్ అహ్మద్. ఉదాహరణకు ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ దానిపైన ఫోకస్ చేస్తున్నారు. అప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగితే.. బి గ్రేడ్ ఆటగాలను క్రికెట్ ఆస్ట్రేలియా పంపిస్తోందని మండిపడ్డారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed). తోపు క్రికెటర్లు అందరూ ఐపీఎల్ ఆడేలా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా బీసీసీఐ మాట వినాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు.
ఇలా బీసీసీఐకి భయపడి ఇంగ్లాండ్ అటు ఆస్ట్రేలియా లాంటి బలమైన క్రికెట్ బోర్డులు కూడా తోక ముడుస్తున్నాయని మండిపడ్డారు. ఆర్థికంగా బీసీసీఐ ( BCCI) బలంగా ఉన్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే క్రికెట్ అంతరించిపోవడం గ్యారంటీ అని హెచ్చరించారు తన్వీర్ అహ్మద్. ఇకనైనా అన్ని క్రికెట్ బోర్డులు ఏకతాటిపైకి రావాలని కోరారు. బీసీసీఐ నుంచి క్రికెట్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.