LPG booking rules Big update: వంట గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది కేంద్రం. ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన వ్యవధిని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ సమయాన్ని 25 రోజులకు కుదించింది. దీంతో పట్టణ-గ్రామీణ ప్రాంతంలోని గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ లభించినట్లయ్యింది.
వంట గ్యాస్ గృహ ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు ఇకపై 25 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్రం సోమవారం ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి సంక్షోభం కొనసాగుతున్నా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వర్తించే బుకింగ్ వ్యవధితో సమానంగా నిర్ణయం తీసుకుంది.
దేశీయ ఎల్పీజీ సరఫరా మెరుగుపడిన దృష్ట్యా ఎల్పీజీ రీఫిల్ బుకింగ్‌లపై గతంలో విధించిన ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశీయ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్స్‌కు 25 రోజుల సమాన వ్యవధిని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎక్కువ రోజులపాటు వేచి ఉండేవారు సామాన్యులు.
ఈ విషయంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు వేర్వేరు బుకింగ్ వ్యవధులు ఉండేవి. పట్టణ ప్రాంతాల్లో LPG వినియోగదారులు 25 రోజుల తర్వాత రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు 45 రోజులు వేచి ఉండేవారు. బుకింగ్ కూడా ఆయా ఏజెన్సీలు తీసుకునే కావు. ఫలానా తేదీ తర్వాత బుకింగ్ చేసుకోవాలని మెసేజ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దీనికి అదనంగా గ్యాస్ వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మరో 10 రోజులు పట్టేది.
ALSO READ: జన్ ధన్ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..
జరుగుతున్న పరిణామాలను గమనించిన కేంద్రం, ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరగడంతో పరిమితులను అమలు చేసింది. ప్రస్తుతం దేశీయంగా గ్యాస్ సరఫరాలో పరిస్థితి మెరుగుపడటంతో పెండింగ్ బుకింగ్స్ గణనీయంగా తగ్గాయి. పట్టణ-గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలని డిసైడ్ అయ్యింది.