E-Paper
Advertisement

Goa : భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?

Goa : ఓ హోటల్‌ మేనేజర్‌ భార్యను సముద్రంలో ముంచి హత్య చేశాడు. తన భార్య ప్రమాదవశాత్తు మరణించిందని చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు ప్రయత్నించాడు . ఈ ఘటన గోవాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన గౌరవ్ కటియార్ (29) గోవాలో ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు గతేడాది దీక్షా గంగ్వార్‌ (27) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దికాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్తకు వివాహేతర సంబంధం ఉందని దీక్షా ఆరోపించేది.

ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గౌరవ్‌ తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఆమెను గోవాలోని కాబో డి రామ తీరానికి తీసుకెళ్లాడు. అక్కడ తన భార్యను నీటిలో ముంచి హత్య చేశాడు. నీటిలోకి ఇద్దరు వెళ్లి.. గౌరవ్‌ మాత్రమే తిరిగి రావడాన్ని అక్కడి పర్యాటకులు గమనించారు.

Advertisement

తక్షణమే అక్కడి పర్యాటకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందని.. ఆమెను కాపాడలేకపోయానంటూ నాటకమాడాడు. భార్య చనిపోయిందని ధ్రువీకరించుకున్నాకే గౌరవ్‌ నీటి నుంచి బయటకు వచ్చినట్టు ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో స్పష్టంగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×