Aishwarya Lakshmi:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. సినీ తారల వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు తారలు డీప్ ఫేక్ బారినపడి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ కూడా సోషల్ మీడియా కారణంగా నరకం అనుభవించానని .. అసలు సోషల్ మీడియా పేరు ఎత్తితేనే భయం వేస్తోంది అంటూ సంచలన కామెంట్లు చేసింది. అంతేకాదు వారి టార్చర్ వల్లే సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి.
కింగ్ ఆఫ్ కోత, పొన్నియన్ సెల్వన్ 2, థగ్ లైఫ్ , క్రిస్టోఫర్ వంటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఐశ్వర్య లక్ష్మి.. విష్ణు విశాల్ హీరోగా నటించిన మట్టి కుస్తీ (గట్టా కుస్తీ) సినిమాతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను ఒకేసారి మెప్పించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో వరుసగా ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది. కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈమె.. తాజాగా మట్టి కుస్తీ 2 చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమాకి కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియా వాడకంపై సంచలన కామెంట్లు చేసింది. ఒకప్పుడు ఇంస్టాగ్రామ్ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చురుకుగా ఉండే ఈమె.. ఇప్పుడు సడన్గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసి అందుకు గల కారణాన్ని కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
also read:రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..” ఒకప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా చురుకుగా ఉండేదాన్ని. అయితే అదే సమయంలో సోషల్ మీడియా కారణంగా నేను నరకం అనుభవించాను. నిజానికి సోషల్ మీడియా వాడుతున్నప్పుడు కొంతమంది నా ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దానివల్ల మానసికంగా కృంగిపోయాను. అదే సమయంలో ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందని, అందరూ నన్ను ద్వేషిస్తున్నారని అనిపించింది. అందుకే ఇకపై సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను మనశ్శాంతిగా ఉన్నాను. ఇకపోతే ఏదైనా సమాచారాన్ని ఆడియన్స్ కి చేరవేయాలి అనిపిస్తే సోషల్ మీడియాలో కాకుండా నేరుగా నేనే ప్రజలను కలవడానికి ఇష్టపడుతున్నాను” అంటూ తెలిపింది. మొత్తానికి అయితే సోషల్ మీడియా ప్రభావం తనపై ఏ విధంగా చూపిందో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక ఐశ్వర్య లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. రోహిత్ కెపి దర్శకత్వంలో కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, అనన్య నాగళ్ళ, సాయికుమార్, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘అసుర ఆగమనం’ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.