BigTV English

Groom forgets to attend wedding: రాత్రయితున్నా పెళ్లి మండపంలోకి వరుడు రాలే.. ఎక్కడా అని వెతకగా కారులో..

Groom forgets to attend wedding: రాత్రయితున్నా పెళ్లి మండపంలోకి వరుడు రాలే.. ఎక్కడా అని వెతకగా కారులో..

Groom forgets to attend wedding after getting drunk: అక్కడ పెళ్లి జరుగుతుంది.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. చుట్టాలంతా వచ్చారు. వధువు కూడా పెళ్లి మండపానికి వచ్చింది. కానీ, వరుడు మాత్రం రావడంలేదు.. ఇంకా రావాట్లేదేంటని అంతా ఎదురుచూస్తున్నారు. రాత్రియితున్నా వరుడు రాలే.. దీంతో వధువు తరఫు బంధువులు కోపంగా చుట్టుపక్కల అంతా వెతికారు. చివరకు అతను దొరికాడు. అప్పుడు అతడి పరిస్థితిని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వాడిని చేసుకోనంటే చేసుకోనంటూ వధువు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసింది. అంతేకాకుండా ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని కోరింది.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని కటిహార్ లోని ఓ పెళ్లి మండపంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ పెళ్లి కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పెళ్లి అనగా మండపానికి వధువు వచ్చింది. చుట్టాలు కూడా భారీగానే వచ్చారు. కానీ, పెళ్లికొడుకు రాలేదు. అతడి కోసం అంతా వేచి చూశారు. సమయం గడిచిపోతుంది కానీ, అతను రావడంలేదు. రాత్రయితున్నా అతను రావట్లేదు. దీంతో వధువు తరఫు బంధువులు ఆగ్రహంతో వరుడి కోసం వెతికారు. చివరకు అతను చుట్టుపక్కల ఉన్న ఓ కారులో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని కారులోంచి బయటకు తీసుకొచ్చి చూడగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.

అలా మద్యం మత్తులో ఉన్న వరుడుని చూసి వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని చేసుకోబోనంటూ పెళ్లికి నిరాకరించింది. అంతేకాదు.. పెళ్లి కార్యక్రమం కోసం తమ కుటుంబ ఖర్చు చేసిన డబ్బులను ఇవ్వాలని.. అప్పటివరకు వారిని వదిలిబెట్టబోనని తెలిపింది. దీంతో వరుడి తరఫు బంధువులు ఆ డబ్బులను ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, వరుడు మాట్లాడుతూ.. పెళ్లికి వస్తున్న సమయంలో తన స్నేహితులు మత్తు కలిగించే కొన్ని పదార్థాలను ఇచ్చారని.. అవి ఏంటో తెలుసుకోకుండా తాను తినడంతో మత్తులోకి వెళ్లానంటూ అతను చెప్పినట్లు సమాచారం.


Also Read: విహారయాత్రలో విషాదం.. విద్యార్థుల్ని మింగేసిన సుడిగుండం

అయితే, వధువు బంధువులు మాత్రం అతను మద్యానికి బానిసయ్యాడు.. అతను చెబుతున్నదంతా అబద్ధమంటూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×