BigTV English

Happy Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

Happy Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి  ఈ సందేశాలు  పంపండి

Happy Independence Day 2024: భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి ఆగష్టు 15, 1947 న స్వాతంత్య్రం పొందింది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలు పోగొట్టుకుని, రక్తాన్ని చిందించి స్వాతంత్య్ర భారతదేశ అధ్యాయాన్ని చరిత్ర పుటల్లో నిలిపారు. ఈ రోజు ప్రతీ భారత పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రతీ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం రోజు స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం.


స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జెండాను ఎగురవేయడంతో పాటు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.బ్రిటీష్ పాలనలో దాదాపు 200 సంవత్సరాల తర్వాత భారత దేశానికి ఆగస్టు 15, 1947 న స్వాతంత్య్రం లభించింది. ఇది భారతదేశ 78 వ స్వాతంత్ర దినోత్సవం. కుల మతాలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ రోజు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం దాదాపు వారం రోజుల పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించుకుంటారు.

అందుకోసం ఇది ప్రత్యేకమైన రోజున ప్రతి ఒక్కరూ అందరికీ శుభాకాంక్షలు చెబుతుంటారు. కాబట్టి సంతోషకరమైన పండగను మరింత గుర్తుండిపోయేలా చేయడానికి ఈ రోజు మీకు కొన్ని ప్రత్యేక శుభాకాంక్షల సందేశాలను అందిస్తున్నాం. వాట్సప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా మీరు ఈ ప్రత్యేక రోజున మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందేశాలను పంపించవచ్చు.


  • ఈ ప్రత్యేకమైన రోజు స్వేచ్ఛగా జీవించ గలిగిన భారత్ దేశం కోసం పోరాడిన వారందరికీ నా నివాళులు అర్పిస్తున్నాను. భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • ఆమె అన్ని దేశాలకు రాణి, నా మాతృభూమి.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • ప్రతి ఇంట్లో ఒక ఖాదీ రామ్ పుడతాడు.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • స్వాతంత్ర దినోత్సవాన్ని త్రివర్ణ రంగులతో సెలబ్రేట్ చేసుకోండి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు  !
  • ఆగష్టు 15 వ తేదీన దేశంలోని వందలాది మంది వీరుల రక్తానికి బదులుగా స్వాతంత్య్రం వచ్చింది. ఈ ప్రత్యేక రోజున మనమందరం వారికి నివాళులు అర్పిద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • భారత దేశం నా దేశం మాత్రమే బుద్ధుడు, మహాత్ముడు, మరెందరో మంది జ్ఞానులు ఈ దేశంలో జన్మించారు. వారి పాదస్పర్శతో దేశం భారత దేశం ధన్యమైంది. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • అందరికీ 78 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
  • అసాధ్యమైన అవకాశంతో తుఫానుతో కూడిన రథంలో, విముక్తి ప్రతిజ్ఞతో సజీవంగా మరణిస్తున్న విప్లవ వీరుడు మీరు. అగ్ని అక్షరాలతో రాసిన చరిత్ర నేతాజీ సుభాష్ చంద్రబోస్.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • వీర సైనికులు స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. వారి సహకారం మరవలేని ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !
  • గర్వించదగిన నా భారత దేశ సోదర సోదరీమణులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు !

Tags

Related News

Modi New Strategy: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం.. ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×