E-Paper
Advertisement

Indian Navy : నేవీ అమ్ములపొదిలో కొత్త అస్త్రం .. లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో ..

Indian Navy : నేవీ అమ్ములపొదిలో కొత్త అస్త్రం .. లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో  ..
Advertisement

Indian navy latest news today(Current news from India) : భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరనుంది. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడోను నేవీ విజయవంతంగా పరీక్షించింది. నీటిలోపల లక్ష్యాన్ని ఈ టార్పిడో ఛేదించింది. ఈ ప్రయోగ వీడియోను నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల తయారీ కోసం నేవీ, డీఆర్‌డీవో ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో భారీ టార్పిడోను అభివృద్ధి చేశాయి. ఈ హెవీ వెయిట్‌ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశామని నేవీ ప్రకటించింది.ఆత్మనిర్భరతకు ఇది నిదర్శనంగా పేర్కొంది. కానీ ఈ టార్పిడో పేరు, ఫీచర్లను నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. హిందూ మహా సముద్రంలో చైనా చర్యలతో ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నేవీ ఈ ప్రయోగం చేపట్టడం విశేషం.

Advertisement

ఇప్పటికే భారత నౌకాదళంలో వరుణాస్త్ర అనే భారీ టార్పిడో ఉంది. నీటి అడుగు నుంచి క్షిపణిని ప్రయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి శత్రునౌకల పైకి ఈ టార్పిడోను ప్రయోగిస్తారు. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ ఈ టార్పిడోను అభివృద్ధి చేసింది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×