BigTV English

Hit and Run Law | ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఉడికిపోతున్న రాష్ట్రాలు.. పెట్రోల్ దొరకని పరిస్థితి!

Hit and Run Law | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని ట్రక్కు, బస్సు డ్రైవర్లు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. చాలా చోట్ల కూరగాయలు, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాలు తీసుకొస్తున్న ట్రక్కులు నిలిచిపోవడంతో సామాన్య జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Hit and Run Law | ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఉడికిపోతున్న రాష్ట్రాలు.. పెట్రోల్ దొరకని పరిస్థితి!

Hit and Run Law | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని ట్రక్కు, బస్సు డ్రైవర్లు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. చాలా చోట్ల కూరగాయలు, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాలు తీసుకొస్తున్న ట్రక్కులు నిలిచిపోవడంతో సామాన్య జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు గంటల తరబడి బస్సులకోసం బస్టాప్ వద్ద వేచిచూస్తున్నారు. కానీ బస్సు డ్రైవర్లు నిరసన చేస్తుండడంతో బస్సులు రాని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ రవాణా ఆగిపోవడంతో పెట్రోల్ పంపుల వద్ద జనం బారులు తీరారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జమ్ము కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నిరసనలు తీవ్రంగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ఏముంది?
కొత్త చట్టం భారతీయ దండ సంహిత సెక్షన్ 279 ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసులో ఎవరైనా వాహన డ్రైవర్ రోడ్ యాక్సిడెంట్ జరిగాక పారిపోతే అతనికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.7 లక్షల జరిమానా కూడా విధిస్తారు. అదే యాక్సిడెంట్ జరిగాక డ్రైవర్ బాధితుడిని ఆస్పత్రికి తీసుకుపోతే శిక్ష తగ్గే అవకాశం ఉంది.


కానీ పాత చట్ట ప్రకారం.. జరిగింది యాక్సిడెంట్ కాబట్టి ట్రక్కు లేదా బస్సు డ్రైవర్‌కు కొంత సమయం తరువాత బెయిలుపై విడుదల చేసేవారు. లేదా యాక్సిడెంట్ తీవ్రతను బట్టి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. అదే ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం.. పదేళ్ల జైలు శిక్ష తప్పనిసరి. అందుకే ట్రక్కు, బస్సు డ్రైవర్లు ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్.. పోలీసులు లేదా కోర్టు మేజిస్ట్రేట్(న్యాయమూర్తి)కి సూచన చేయకుండా ఉంటేనే ఈ 10 ఏళ్ల జైలు శిక్ష.

మహారాష్ట్రలో హింసాత్మకంగా మారిన నిరసన


మహారాష్ట్రలో కొన్ని చోట్ల నిరసన జరుగుతుండగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని నేరుల్ ప్రాంతంలో నిరసన చేస్తున్న కొంతమంది డ్రైవర్లు అటువైపుగా వెళుతున్న వాహనాలపై రాళ్లతో దాడులు చేశారు, అడ్డుకున్న పోలీసులతో ఘరణపడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు.

ముంబై సమీపంలోని థానే జిల్లాలో మీరా భయండర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ రాజ్ మార్గ్‌లో నిరసనకారులు ట్రాఫిక్ నిలిపివేశారు. పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. అలాగూ సోలాపూర్, కోల్హాపూర్, నాగ్‌పూర్, గోందియా జిల్లాల్లో రోడ్లు బ్లాక్ చేసి నిరసనలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్రలో పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు పని ఆపేశారు. పెట్రోల్ డిపో ఉన్న పెనెవాడీ గ్రామంలో వెయ్యి ట్రక్కులకు పైగా నిలిచిపోయి ఉన్నట్లు సమాచారం. దీంతో పెట్రోల్ పంపు డీలర్లు స్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో పంపులు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులే మధ్రప్రదేశ్‌, రాజస్థాన్, ఢిల్లీలో కనిపిస్తున్నాయి.

జాతీయ ట్రక్కు డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర కపూర్ దేశంలోని ట్రక్కు డ్రైవర్ల పేరిట ఒక లెటర్ రాశారు. దేశంలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ, రిపబ్లిక్ డే లాంటి ఉత్సవాల వరకు వేచి ఉండాలని.. నిరసనలు చేయకుండా, ధైర్యం వహించాలని ఆయన ఈ లెటర్ ద్వారా కోరారు. మరి కొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒకవేళ సమస్య పరిష్కారం జరుగకపోతే అప్పుడు కఠిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×