E-Paper
Advertisement

Husband Wife Dispute: విడాకులు రాకముందే రెండో పెళ్లా? స్టేజ్‌పైకి వచ్చిన మొదటి భార్య.. ఆ తర్వాత ఏమైందంటే!

Husband Wife Dispute: విడాకులు రాకముందే రెండో పెళ్లా? స్టేజ్‌పైకి వచ్చిన మొదటి భార్య.. ఆ తర్వాత ఏమైందంటే!
Advertisement

Husband Wife Dispute: ఈ రోజుల్లో ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంటేనే.. బాబోయ్.. వద్దు అంటూ పారిపోతోంది నేటి యువత. అయితే ఇందుకు విరుద్దంగా ఒకటి కాదు.. రెండో పెళ్లికి సిద్దమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే మరో పెళ్లికి సిద్దమైన పెళ్లి కొడుకు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయాడు. ఈ తతంగాన్ని మొదటి భార్య అడ్డుకోవడంతో పెళ్లి కొడుకు షాకయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని అంకలేశ్వర్ నివాసి అయిన యువతి రేష్మ, చదువుకుంటున్న సమయంలోనే వినయ్ తో ప్రేమలో పడింది. దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోడంతో మార్చి 30, 2022న కోర్టులో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రెండు కుటుంబాలు అంగీకారం చెప్పడంతో, ఇరు కుటుంబాలు కలిసి గ్రాండ్ గా వేడుక నిర్వహించారు. అయితే కొద్ది రోజులకే వినయ్, రేష్మ మధ్య గొడవలు ప్రారంభమవడంతో ఇరు కుటుంబాల పెద్దలు సర్ధి చెప్పారు. మరి కొన్ని రోజుల తరువాత మరోసారి మనస్పర్థలు రావడంతో, పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టుకోవడం, వివాదం కోర్టుకెళ్లడం జరిగింది. వినయ్, రేష్మలు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే విడాకుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అధికారికంగా వారు విడిపోలేదు.

విడాకుల వ్యవహారం కొనసాగుతుండగానే, వినయ్ యూపీలోని తన స్వగ్రామానికి వచ్చాడు. అక్కడ వినయ్ కి వారి కుటుంబం మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. భారీ హంగామాతో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంది వినయ్ కుటుంబం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్.. ఈ విషయం రేష్మకు తెలిసింది. వెంటనే రేష్మ యూపీలోని బస్తీ జిల్లా పోలీసులను ఆశ్రయించింది. మా విడాకుల వ్యవహారం తేలకముందే, వినయ్ మరో పెళ్లి చేసుకుంటున్నాడని రేష్మ పోలీసు ఫిర్యాదు చేసింది.

Advertisement

వరుడు వినయ్ ఆనంద్ శర్మ జైమాలా వేడుక తర్వాత కూర్చున్నప్పుడు, అతని మొదటి భార్య రేష్మ తన కుటుంబంతో కలిసి వేదికపైకి వచ్చి.. వినయ్ తో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను చూపించింది. వరుడు తనను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నప్పటికీ మళ్ళీ వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది.

అంతే కాకుండా, వినయ్ తన ఖాతా నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడని, తన పేరు కారు ఫైనాన్స్ లో తీసుకున్నాడని రేష్మ చెప్పింది. ఇంతలో, పోలీసు అధికారులు వేదిక వద్దకు చేరుకుని, ఇరువర్గాలను శాంతింపజేసి, వరుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఈ ఘటనపై యూపీ పోలీసు అధికారి మాట్లాడుతూ, “వేరే రాష్ట్రానికి చెందిన ఒక మహిళ తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ దరఖాస్తు దాఖలు చేసింది. అయితే వారి విడాకుల కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వివాహం కొనసాగించకూడదని రెండు పార్టీలు అంగీకరించాయి. ఈ విషయం దర్యాప్తులో ఉంది” అని అన్నారు.

Read Also: Saurabh Sharma RTO: ‘టెంపర్’ సినిమాను మించిన అవినీతి.. రూ.28 వేల జీతం, రూ.1000 కోట్ల ఆస్తులు!

Related News

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

Big Stories

Advertisement
×