BigTV English

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG Film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన తాజా చిత్రం ఓజీ(OG). ఈ సినిమా మరికొన్ని నిమిషాలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానుల హంగామా మొదలైంది. ఇప్పటికే ప్రీమియర్లకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. సుజీత్(Sujeeth) దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందు రాబోతుంది అయితే నేడు రాత్రి పది గంటలకు ఈ సినిమా ప్రీమియర్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.


పవన్ కెరియర్ లోనే హైయెస్ట్…

ఇక ఈ సినిమా పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ చేస్తుంటే మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ కి (Remuneration)సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఉన్నటుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించినందుకు ఏకంగా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ రెమ్యూనరేషన్ పవన్ కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పవచ్చు.

భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు..


ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుజిత్ 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ 5 కోట్ల రూపాయలు, విలన్ పాత్రలో పవన్ కళ్యాణ్ తో పోటీపడిన నటుడు ఇమ్రాన్ హష్మి రూ.5 ఐదు కోట్లు, ఇక ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈమె రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో లేడీ శివంగిలా నటించిన నటి శ్రేయ రెడ్డి తన నటనకు గాను 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో అత్యధికంగా పవన్ కళ్యాణ్ కు రెమ్యూనరేషన్ అందించడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.

ఊహించని స్థాయిలో ఆదరణ..

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ సినిమాకు గాను రెమ్యూనరేషన్ అందుకోలేదని చెప్పాలి. మొదటిసారి ఓజీ సినిమాకు రూ.80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్నో అంచనాల నడుమ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రీమియర్లకు కూడా ఊహించిన విధంగా మంచి ఆదరణ లభిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది.. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.

Also Read: OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

Related News

OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు

Big Stories

×